హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యక్తిగత సహాయకుడు బాలాజీని కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రా-కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులోని నగరిగేర వద్ద పేకాట ఆడుతూ రెడ్‌హ్యాండెట్‌గా పట్టుబడ్డారు. పేకట స్థావరంపై కర్ణాటక పోలీసులు దాడులు చేసి.. హిందూపురానికి చెందిన 19 మంది పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను కర్ణాటక రాష్ట్రంలోని చిక్బల్లాపూర్ జిల్లా గుడిబండ కోర్టులో హాజరుపరిచారు.
ఇది చదవండి : విలు విద్యకు ప్రాణం పోస్తున్న కడప కుర్రాడు!
బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆయన తరపున పీఏలే ఎక్కువ పనులు చక్క బెడుతూ ఉంటారు. హిందూపురం ఎమ్మెల్యే, హీరో బాలయ్య పీఏ అరెస్ట్ కావడం ప్రస్తుతం రాజకీయాల్లో హీట్ పుట్టిస్తోంది. అందులో అతడు వైసీపీ నేతలతో పేకాట ఆడడం అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయింది. బాలయ్య కార్యక్రమాలతో పాటు హిందూపురంలో వ్యవహారాలన్నీ బాలాజీనే చూస్తారని సమాచారం. ఈ క్రమంలో పీఏ విషయంలో బాలయ్య ఎలాంటి నిర్ణయం తీసుకొంటాడన్న సస్సెన్స్ నెలకొంది.