కుక్కకు మందులు తెస్తానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. కానీ, సాయంత్రం అయినా.. అతడు ఇంటికి రాలేదు. దీంతో అతని తల్లిదండ్రులు స్థానిక ప్రాంతాల్లో వెతికారు. కట్ చేస్తే ఈ యువకుడు చెరువులో శవమై తేలాడు. అసలేం జరిగిందంటే?
కుక్కకు మందులు తెస్తానని ఇంట్లో చెప్పి వెళ్లిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి చివరికి చెరువులో శవమై తేలాడు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటనతో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగి మరణం వెనుక ఏం జరిగింది? అతడిని ఎవరైనా హత్య చేశారా? లేక తానే ఆత్మహత్య చేసుకున్నాడా? ఈ ఘటనలో అసలేం జరిగిందనే వివరాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అది మేడ్చల్ జిల్లా బాచుపల్లి పరిధిలోని ప్రగతి నగర్. ఇక్కడే మధురా నగర్ కాలనీలో మణికంఠవర్మ అనే యవకుడు నివాసం ఉంటున్నాడు. ఇతడు నగరంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. అయితే గత బుధవారం కుక్కకు మందులు తెస్తానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. కానీ, సాయంత్రం అయినా.. మణికంఠశర్మ ఇంటికి రాలేదు. దీంతో అతనికి తల్లిదండ్రులు ఫోన్ చేయగా.. స్విచ్చాఫ్ వచ్చింది. ఇక ఏం చేయాలో తెలియక అతని కుటుంబ సభ్యులు ఇదే విషయాన్ని మణికంఠశర్మ స్నేహితులకు తెలియజేశారు.
ఇక అందరూ కలిసి స్థానిక ప్రాంతాల్లో గాలించారు. అయినా అతని ఆచూకి మాత్రం దొరకలేదు. చేసేదేం లేక ఆ యువకుడి తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే పోలీసులకు ఓ సమాచారం అందింది. వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండలం జానంపేటలో మణికంఠశర్మ చెరువులో శవమై తేలాడని చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం చెరువులో శవమై కనిపించిన మణికంఠశర్మ మృతదేహాన్ని పరిశీలించారు.
అనంతరం పోలీసులు గట్టుపై ఉన్న కారు డోర్ తీసి చూడగా… అందులో మణికంఠశర్మ సెల్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉంది. దీంతో పోలీసులు ఆ మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మణికంఠ మృతదేహాన్ని చూసి గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ముందుగా మృతుడి కుటుంబ సభ్యులను విచారించగా.. గతంలో మణికంఠశర్మ తండ్రి గండిమైసమ్మ ప్రాంతంలో 340 గజాల ప్లాటు కొనుగోలు చేశాడు. అయితే ఈ వెంచర్ పక్కనే ఇటీవల ఓ పార్టీ ఆఫీసు నిర్మాణాన్ని చేపట్టారు. దీంతో స్థానిక లీడర్లు పార్కింగ్ కోసం ఈ స్థలాన్ని చదువును చేశారు. ఆ తర్వాత ఈ ఘటనపై మణికంఠశర్మ తండ్రి కోర్టులో కేసు వేశాడు. దీని కారణంగానే వారితో మణికంఠవర్మకు, అతని తండ్రికి చిన్నపాటి గొడవలు జరిగియాని మృతుడి తల్లిదండ్రులు తెలిపారు. అయితే మణికంఠశర్మను ఎవరైనా హత్య చేశారా? లేక తానే ఆత్మహత్య చేసుకున్నాడా? ఇలా అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.