మేడ్చల్ జిల్లాలోని గత రెండు మూడు రోజుల నుంచి బీటెక్ చదువుతున్న యువతి కనిపించకుండాపోయిన విషయం తెలిసిందే. అయితే మిస్సింగ్ కేసు కింద నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించి ఇన్ స్టాగ్రామ్ సాయంతో మహారాష్ట్రలో ఉన్నట్లు తేల్చారు. ఈ వార్తతో ఆ యువతి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అసలు విషయం ఏంటంటే? మేడ్చల్ జిల్లా కండ్లకోయలో వర్షిణి అనే యువతి స్థానికంగా ఓ ఇంజనీర్ కాలేజీలో బీటెక్ చదువుతోంది.
అయితే రెండు రోజుల క్రితం వర్షిణి కాలేజీకి వెళ్లి రాత్రైన ఇంటికి తిరిగి రాలేదు. దీంతో వర్షిణి తల్లిదండ్రులు బంధువులను అడిగి తెలుసుకున్నా కూడా ఆమె ఆచూకి దొరకలేదు. దీంతో ఖంగారుపడ్డ ఆ యువతి తల్లిదండ్రులు వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇక యువతి పేరు మీదున్న ఇన్ స్టాగ్రామ్ ఆధారంగా యువతి మహారాష్ట్రలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే తెలంగాణ పోలీసులు మహారాష్ట్ర పోలీసులను అలెర్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: Hyderabad: పెళ్లి పేరుతో యువతితో SI సహజీవనం.. పెళ్లయినా కూడా..
అలెర్ట్ అయిన అక్కడి పోలీసులు వర్షిణి క్షేమంగానే ఉందని తేల్చారు. దీంతో హుటాహుటిన యువతి తల్లిదండ్రులతో పాటు తెలంగాణ పోలీసులు మహారాష్ట్ర వెళ్లి తీసుకొచ్చే పనిలో ఉన్నారని పోలీసులు తెలిపారు. అయితే ఆ యువతి తీవ్ర ఒత్తిడికి గురైన కారణంగానే డిప్రెషన్ లోకి వెళ్లి ఇంటి నుంచి వెళ్లినట్లుగా పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో యువతి గత మూడు రోజులుగా రెండు రాష్ట్రాల పోలీసులకు చెమటలు పట్టించిందనే చెప్పాలి. ఈ వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.