భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తింటి వేధింపులు, మానసిక ఒత్తిళ్లు.. ఇలా కారణాలు ఏమైన కొందరు వివాహితలు భర్తను కాదని ఇంట్లో నుంచి కనిపించకుండపోతున్నారు. ఇలాంటి ఘటనలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే? జిల్లాలోని రైకోడ్ మండలం సంగాపూర్ గ్రామానికి చెందిన ఆశంగారి మోహన్ రెడ్డికి ఝురాసంగం మండలంలోని జోనా గ్రామానికి చెందిన గాయత్రి అనే యువతితో గతేడాది వివాహం జరిగింది.
పెళ్ళైన కొంత కాలం పాటు భార్యాభర్తలు ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా కాపురాన్ని నెట్టుకొచ్చారు. అయితే ఇటీవల ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. గురువారం రాత్రి 2 గంటల నుంచి గాయత్రి కనిపించకుండపోయింది. దీంతో అత్తమామలు, భర్త ఖంగారుపడి బంధువులకు సమాచారం ఇచ్చి ఆమె జాడ కోసం అటు ఇటు అంతా వెతికారారు. ఎంత వెతికిన ఆమె మాత్రం కనిపిచలేదు.
ఇక ఏం చేయాలో అర్థంకాక భర్త స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. అయితే గాయత్రి కనిపించకుండపోవడానికి భార్యాభర్తల మధ్య ఏమైన గొడవలు జరిగాయా? లేక మరేదైన కారణం ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఇక పెళ్ళైన ఏడాదికే కూతురు కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: యువతి గుండెపోటుతో మృతి.. 45 రోజుల తర్వాత ఫోన్ చూసి విస్తుపోయిన కుటుంబం!