Jewellery: రంజాన్ పండుగకు ఇంటికి పిలిచిన స్నేహితుడి ఇంట్లోనే కన్నం వేశాడో వ్యక్తి. స్నేహితుడి ఇంట్లో దొంగతనం చేయటమే కాకుండా దొంగతనం చేసిన వాటిని బిర్యానీతో కలిపి మింగేశాడు. ఈ సంఘటన తమిళనాడులోని చెన్నైలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చెన్నైలోని విరుంగబాక్కం పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న ఓ మహిళ రంజాన్ పండుగ రోజున తన స్నేహితుడ్ని విందుకు పిలిచింది. సదరు స్నేహితుడితో పాటు అతడి ప్రియురాలు కూడా విందుకు వచ్చింది. విందు అయిపోయిన తర్వాత స్నేహితుడు, అతడి ప్రియురాలు అక్కడినుంచి వెళ్లిపోయారు. మరుసటి రోజు ఆ ఇంట్లో గోల్డ్ చైన్, డైమండ్ పెండెంట్ పోయినట్లు విందిచ్చిన మహిళ గుర్తించింది. వెంటనే విరుంగబాక్కం పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. తన ఇంట్లో బంగారు నగలు పోయాయని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మహిళ స్నేహితుడ్ని పోలీస్ స్టేషన్‌కు పిలిచి విచారించగా అసలు విషయం బటయపడింది. అతడే దొంగతనం చేసినట్లు గుర్తించారు. విందు సందర్భంగా సదరు మహిళ బిజీగా ఉన్న సమయంలో బంగారు నగల్ని దొంగిలించానని పోలీసులకు చెప్పాడు. దొంగిలించిన బంగారాన్ని బిర్యానీతో పాటు మింగేసినట్లు వెల్లడించారు. గురువారం పోలీసులు అతడ్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు అతడికి ఎనీమా ఇచ్చి బంగారాన్ని బయటకు తీశారు. బయటకు తీసిన బంగారాన్ని మహిళకు అప్పగించారు. తన బంగారం తనకు దొరకటంతో మహిళ కేసు వెనక్కు తీసుకుంది. నిందితుడు కూడా తాగిన మైకంలో దొంగతనం చేశాడని తేలటంతో పోలీసులు అతడ్ని ఏమీ చెయ్యకుండా వదలేశారు. మరి, ఫ్రెండ్ ఇంటికి కన్నం వేసి, బిర్యానీతోపాటు బంగారాన్ని మింగేసిన ఆ వ్యక్తిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Crime Story: భర్త పర్మిషన్ తో ప్రియుడితో సుఖం! ముగ్గురు కలిసే..! ఊహకి అందని క్రైమ్ స్టోరీ!