మనం.. రోడ్డు మీద వెళ్తున్నపుడు చాలా కనిపిస్తాయి. అవన్నీ కావాలంటే కుదరదు.. మన దగ్గరున్న డబ్బుకు తగ్గట్టుగా మన కోరికలు ఉండాలి. అప్పుడే మనం సరైన దారిలో వెళ్ళగలం. లేదు.. అన్నీ కావాలంటే.. రెండు మార్గాలు.. ఒకటి కష్టపడి సంపాదించడం. మరొకటి తప్పుదారిని ఎంచుకోవడం. మనం చెప్పబోయే కథలో ఒకతను రెండో దారిని ఎంచుకొని దొంగగా మారాడు. పోనీ ఏం ఆశించి దొంగగా మారాడు అనుకుంటే పొరపాటు. అతడి కోరిక చాలా సాధారమైనది. పూర్తి వివరాలు తెలియాలంటే ఇది చదవాల్సిందే.
సమయం అర్థరాత్రి 12 గంటలు. నడిరోడ్డుపై ఒక్కడే వెళ్తున్నాడు. రోడ్డుకు ఇరువైపులా కిరాణాషాపులు. పక్కనే బేకరీ షాప్.. చిప్స్ గుమగుమలాడుతున్నాయి. తిందామనిపిస్తోంది. జేబులో డబ్బుల్లేవ్. మనసులో దొంగతనం చేద్దామని కోరిక కలిగింది. ఇంకేముంది.. అదును చూసి ఒక్కో షాపులో దూరిపోయాడు. మూడు దుకాణాల తాళాలను పగులగొట్టి చోరీకి పాల్పడ్డాడు. మరి ఇంత పకడ్బందీగా చోరీకి పాల్పడ్డాడు అంటే.. భారీగా దోచుకెళ్లాడనే భావన సహజంగానే కలుగుతుంది. అయితే, ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్. ఆ దొంగ మూడు షాపుల్లో చోరీకి పాల్పడి.. కేవలం 20 రూపాయలు మాత్రమే ఎత్తుకెళ్లాడు. అది కూడా ఎందుకోసమో తెలుసా?.. కరకరలాడే చిప్స్ తినాలనిపించి.. ఆ చోరీకి పాల్పడ్డాడట. ఈ విచిత్ర దొంగతనం.. రాజస్థాన్‌లోని సికర్ జిల్లా ఫతేపూర్‌లో వెలుగు చూసింది.
ఇది కూడా చదవండి: లవర్ తో భార్య సీక్రెట్ ఛాటింగ్.. అసలు విషయం భర్తకు తెలియడంతో ఊహించని సీన్!
ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు.. ఆ విజువల్స్ ఆధారంగా నిందితుడు ఆసిఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో షాకింగ్ విషయాలు తెలుసుకుని పోలీసులు ఆశ్చర్యపోయారు. ఆ దొంగకు టైమ్ పాస్ కోసం చిప్స్ తినాలని అనిపించిందట. తన వద్ద డబ్బులు లేకపోవడంతో దొంగతనం చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఆ క్రమంలోనే.. అతను మూడు షాపుల్లో చోరీకి పాల్పడ్డాడు. మరి మూడు షాపుల తాళాలు పగులగొట్టి అతను ఎత్తుకెళ్లింది కేవలం 20 రూపాయలు మాత్రమే అని తెలుసుకుని పోలీసులు బిత్తరపోయారు.
అయితే, అతని మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు నిర్ధారించుకున్నారు. అతనికి వైద్యం అందించాల్సిన అవసరం ఉందని సబ్ ఇన్‌స్పెక్టర్ ఉదయ్ సింగ్ తెలిపారు. చోరీకి పాల్పడిన విషయాన్ని నిందితుడు అంగీకరించాడని, అయితే అతని మానసిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదన్నారు. నిందితుడి కుటుంబ సభ్యుల సహకారంతో అతనికి చికిత్స అందించాల్సి ఉందని ఎస్సై చెప్పారు.మరి ఈ దొంగపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: స్నేహితుడని నమ్మితే దారుణంగా మోసం చేశాడు: హీరోయిన్