పవిత్ర తిరుమల క్షేత్రం చుట్టూ వివాదాలు నెలకొంటున్నాయి. ఇటీవలే తిరుమల శ్రీవారి ఆలయంపై డ్రోన్ హల్చల్ చేయడం, డ్రోన్ ఎగరేసిన వ్యక్తిపై కేసు నమోదు చేయడం మనం చూశాం. ఈ ఘటన మరువక ముందే తిరుమలలో మరో ఘటన చోటు చేసుకుంది. పవిత్ర తిరుమల క్షేత్రంలో డ్రోన్ కలకలం వివాదం ముగియక ముందే మరో వివాదం కలకలం రేపింది. ఏకంగా లడ్డూ కౌంటర్ లోనే దొంగతనం జరిగింది. సోమవారం అర్థరాత్రి 36వ కౌంటర్ లో చోరీ జరిగింది. […]
హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి సమయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న పలు కాలనీలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుస దొంగతనాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ గా చేసుకుని దొంగలు చోరీలకు పాల్పడి.. అందిన కాడికి దోచుకెళ్తున్నారు. దీంతో కష్టపడి సంపాదించుకున్న సొమ్ము, ఇతర విలువైన వస్తువులు పోవడంతో నగరవాసులు లబోదిపబోమంటున్నారు. తాజాగా కూకట్ పల్లి పీఎస్ పరిధిలోని మూడు కాలనీలోని 16 ఇళ్లలో చోరీలు జరిగాయి. పూర్తి వివరాల్లోకి […]
హైదరాబాద్ లో ఇటీవల కాలంలో జరుగుతున్న వరుస దొంగతనాలు కలవరపెడుతున్నాయి. గత వారం ఒకే రోజు పలు చోట్ల దొంగలు చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు. ఇళ్లల్లో కూడా దొంగతనాలు జరిగిన ఘటనలు వెలుగుచూశాయి. దీంతో నగర వాసులు భయాందోళనలకు గురయ్యారు. అయితే ఇవన్నీ దొంగల పనని పోలీసులు నిర్దారణకు వచ్చారు. కానీ పోలీసు అకాడమీలో చేతి వాటాన్ని ప్రదర్శించిన వ్యక్తి గురించి తెలుసుకుని అవాక్కవ్వడం వాళ్లవంతైంది. వివరాల్లోకి వెళితే.. రాజేంద్ర నగర్ లోని పోలీసు అకాడమీలో […]
సార్.. మా పక్కింటతను నన్ను కొట్టాడు, సార్.. నా మెడలో బంగారం లాక్కెళ్లారు, సార్.. పార్కింగ్‌లో ఉన్న నా కార్ పోయింది.. ఇలాంటి కేసులు పోలీసు స్టేషన్ల వరకు డజన్ల కొద్దీ వస్తుంటాయి. కానీ, ఈ కేసు విభిన్నం. పిల్లి పోయిందంటూ ఓ వ్యక్తి కంప్లెట్ ఇచ్చాడు. సార్ నేను ఎంతో ఇష్టంగా.. ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్న పిల్లిని గుర్తు తెలియని వ్యక్తి ఎత్తికెళ్లిపోయాడు.. మీరే నాకు న్యాయం చేయాలంటూ మహమ్మద్ అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. […]
మొబైల్ ఫోన్.. దీన్ని కనిపెట్టిన వాడు ఎవడో గానీ నిజంగా దండేసి దండం పెట్టాలి. లేకపోతే ఏంటి… ప్రస్తుతం ఇది లేకపోతే ఒక్కపని కూడా జరగదు. ఉదయం నిద్రలేచిన రాత్రి నిద్రపోయే వరకు ప్రతి పనిలోనూ మొబైల్ అవసరం కచ్చితంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మన శరీరంలో చేయి, కాలు ఎలానో.. మొబైల్ కూడా అలా ఓ భాగమైపోయింది. మరి అలాంటి మొబైల్ పోతే, తిరిగి దక్కించుకోవడం చాలా కష్టం. పోలీసుల దగ్గరకు వెళ్లాలి, ఫిర్యాదు చేయాలి. […]
తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగలు రెచ్చిపోతున్నారు. యజమానులు తాళం వేసుకుని ఊరెళ్ళడం పాపం.. రాత్రుళ్ళు ఇళ్లలో దూరి మొత్తం ఊడ్చేస్తున్నారు. దొంగలకి సెలబ్రిటీలు, సాధారణ జనులని తేడా తెలియదు.. వారి కంటికి అందరూ సమానమే. మనుషులు చిన్నోళ్ళా, పెద్దోళ్లా అని చూడరు. కేవలం వస్తువులు చిన్నవా, పెద్దవా అని మాత్రమే చూస్తారు. వారి ఫోకస్ కేవలం విలువైన వస్తువుల మీదనే. అవి ఎవరి ఇంట్లో ఉన్నా ఎత్తుకెళ్లిపోతారు. ఇలాంటి అడ్డ కత్తెరలకి.. తెర […]
సాధారణంగా దొంగలను,హంతకులను పోలీసులు పట్టుకుంటారు. మరికొన్ని సందర్భాల్లో మనుషులు పట్టిస్తారు. కానీ వింతగా.. ఓ దోమ ఓ గజదొంగను పట్టించింది. వినడానికి, చదవడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజమే. ఈ ఘటనకు చైనాలో చోటు చేసుకుంది. అంత పెద్ద మనిషిని, అతి చిన్న దోమ ఎలా పట్టించింది? అసలు ఆ దొంగ ఏం చేశాడు? అనే సందేహాలు అందరికి వ్యక్తమవుతాయి.అందుకే ఈ కేసుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు.. […]
మనం.. రోడ్డు మీద వెళ్తున్నపుడు చాలా కనిపిస్తాయి. అవన్నీ కావాలంటే కుదరదు.. మన దగ్గరున్న డబ్బుకు తగ్గట్టుగా మన కోరికలు ఉండాలి. అప్పుడే మనం సరైన దారిలో వెళ్ళగలం. లేదు.. అన్నీ కావాలంటే.. రెండు మార్గాలు.. ఒకటి కష్టపడి సంపాదించడం. మరొకటి తప్పుదారిని ఎంచుకోవడం. మనం చెప్పబోయే కథలో ఒకతను రెండో దారిని ఎంచుకొని దొంగగా మారాడు. పోనీ ఏం ఆశించి దొంగగా మారాడు అనుకుంటే పొరపాటు. అతడి కోరిక చాలా సాధారమైనది. పూర్తి వివరాలు తెలియాలంటే […]
ప్రేమలో ఉన్నప్పుడు ఎదుటి వాళ్ల కోసం ఎంత రిస్కయినా చేసేయాలి అనిపిస్తుంది. కొంతమంది వెనకాముందు ఏమీ ఆలోచించకుండా నేరాలకు పాల్పడుతుంటారు. ఆ నేరాలే వారి పాలిట శాపాలై జీవితాల్ని నాశనం చేస్తుంటాయి. తమిళనాడుకు చెందిన ఓ యువతి ప్రియుడి జల్సాల కోసం చేసిన పని ఆమె జీవితాన్ని తల్లకిందులు చేసింది. ఆమె జీవితాశయాన్ని చేరుకోలేని పరిస్థితికి తీసుకువచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడు, విల్లుపురం జిల్లాకు చెందిన శివప్రతీక అనే యువతి అదే ప్రాంతానికి చెందిన […]
హైదరాబాద్ : అన్నం పెడుతున్న ఇంటికే కన్నం వేసిందో మహిళ.. కేర్ టేకర్‌గా ఓ వృద్ధురాలిని కాపాడిల్సింది పోయి డబ్బు కోసం దారుణానికి ఒడిగట్టింది. సదరు వృద్ధురాలి ప్రాణాల మీదకు తెచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నాచారం స్నేహపురికాలనీలోని శ్రీనిధి అపార్టుమెంట్‌లో హేమవతి అనే వృద్ధురాలు నివాసం ఉంటోంది. కుమారుడు లండన్‌లో ఉండటంతో తల్లిని చూసుకోవటానికి నెలకు 15 వేల రూపాయల జీతంతో ఓ కేర్ టేకర్‌ను నియమించాడు. మంచిర్యాల జిల్లా మందమర్రి ప్రాంతానికి చెందిన […]