మనిషిలోని సున్నితత్వం రోజు రోజుకు నశిస్తోంది. కొంతమంది చిన్న చిన్న విషయాలకు కూడా విచక్షణ కోల్పోతున్నారు. తాజాగా, ఓ వ్యక్తి పానీ పూరీ డబ్బులు ఎగ్గొట్టే ప్రయత్నం చేశాడు. పానీ పూరీ బండివాడు ఆ డబ్బులు అడగటంతో గొడవకు దిగాడు. చివరకు కేవలం 20 రూపాయల కోసం పానీ పూరీ బండివాడ్ని కత్తితో పొడిచేశాడు. ఈ సంఘటన మహారాష్ట్రలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహారాష్ట్రలోని నాగ్‌పూర్, జారిపట్కా ప్రాంతానికి చెందిన జైరామ్ పానీ పూరీ బండి నడుపుతున్నాడు.
చాలా మంది నిత్యం పానీ పూరీ బండి దగ్గరకు వచ్చి పానీ పూరీ తిని వెళుతుంటారు. పానీ పూరీ బండి ఉండే ప్రాంతంలో ఓ షాపు ఉంది. ఆ షాపులో పని చేసే ఓ వ్యక్తి తరచుగా ఆ పానీ పూరీ బండి దగ్గరకు వచ్చేవాడు. అప్పు పెట్టి పానీ పూరీ తినేవాడు. తర్వాత ఇచ్చేవాడు. ఈ నేపథ్యంలోనే అతడు జైరామ్‌కు 20 రూపాయలు బాకీ పడ్డాడు. ఆదివారం ఆ వ్యక్తి పానీ పూరీ బండి దగ్గరకు వచ్చాడు. తనకు పానీ పూరీ కావాలని అడిగాడు. అయితే, పాత బాకీ 20 రూపాయలు కట్టమని జైరామ్ అన్నాడు. దీంతో ఇద్దరి మధ్యా వాగ్వివాదం చోటుచేసుకుంది. ఆ వాగ్వివాదం కాస్తా కొంత సేపటికి గొడవగా మారింది.
ఈ నేపథ్యంలోనే ఆ వ్యక్తి జైరామ్‌పై కత్తితో దాడి చేశాడు. జైరామ్ కడుపులో పొడిచాడు. అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు. షాపు దగ్గర ఉన్నవాళ్లు గాయపడ్డ జైరామ్‌ను ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన సమాచారం పోలీసులకు చేరింది. పోలీసులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, కేరళలోని మలప్పరంలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. టీ నాణ్యతగా లేదని ఓ వ్యక్తి టీ షాపు వాడిని కత్తితో పొడిచాడు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.