మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. ఓ తన్న తన కన్న కూతురి గొంతు కోసి అతి దారుణంగా హత్య చేసింది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?
సమాజంలో రోజు రోజుకు ఊహించని దారుణాలు వెలుగు చూస్తున్నాయి. ఓ కన్న తల్లి తన మూడు నెలల పసికందును గొంతు కోసి చంపిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటనతో స్థానికులు అంతా ఒక్కసారిగా షాక్ గురవుతున్నారు. అసలు ఆ తల్లి కనిపెంచిన కూతురిని ఎందుకు చంపాలనుకుంది? అందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటి? అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. అది మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతం. ఇక్కడే ఓ మహిళ నివాసం ఉంటుంది. ఆమెకు గతంలో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఈ దంపతుల వైవాహిక జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. ఇకపోతే గత మూడు నెలల కిందట ఈ మహిళ పండంటి కూతురికి జన్మనిచ్చింది. దీంతో దంపతులతో పాటు అందరూ సంతోషపడ్డారు. కానీ, ఇక్కడే ఒక ట్విస్ట్ వచ్చి పడింది. ఆ మహిళ అత్తమామలతో పాటు భర్త బంధువులు అంతా.. నీ కూతురు ముఖంలో నీ పోలికలు అస్సలే లేవంటూ తరుచు చెప్పేవారట.
వీరి మాటలు విన్న ఆ మహిళ తీవ్ర మనస్థాపానికి గురైంది. దీంతో ఆమెకు ఏం చేయాలో తెలియక.. ఇటీవల ఇంట్లో ఎవరూ లేని టైమ్ లో తన మూడు నెలల కూతురి గొంతుకోసి దారుణంగా హత్య చేసింది. ఈ విషయం తెలుసుకున్న భర్త, అత్తమామలు అందరూ ప్రశ్నించగా.. ఎవరో గుర్తు తెలియని మహిళ నా కూతురి గొంతు కోసి హత్య చేసిందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ, ఎందుకో కోడలిపై అత్తమామలకు, భర్తకు అనుమానం వచ్చింది. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఆ మహిళను విచారించగా పొంతనలేని సమాధానాలు చెప్పింది.
ఇక చివరగా పోలీసుల స్టైల్ లో విచారించేసరికి ఆ మహిళ అసలు నిజాలు బయటపెట్టింది. నా కూతురికి నాకు పోలికలు లేవని అందరూ అన్నారని, దీంతో విసుగుచెంది నా బిడ్డ గొంతు కోసి చంపానని తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న బంధువులు అంతా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అనంతరం పోలీసులు ఆ మహిళను అరెస్ట్ చేశారు. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. తన పోలికలతో పుట్టలేదన్న కారణంతో కూతురిని హత్య చేసిన ఈ కసాయి తల్లి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.