పిల్లలు కలగక కొందరు దంపతులు ఎన్నో ఆస్పత్రులు చుట్టు తిరిగినా వారికి పిల్లలు కలగడం లేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి లోనైన ఆ దంపతులు చివరికి ఆత్మహత్య కూడా చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు చాలా చోట్ల జరిగాయి. ఇదిలా ఉంటే మహారాష్ట్రలో ఓ మహిళ మాత్రం ఆడపిల్ల పుట్టిందని మూడు రోజుల పసికందును గొంతు పసికి హత్య చేసింది. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఆడపిల్ల ఇంటికి వెలుగు అని చెబుతుంటారు. కానీ కొందరు మాత్రం ఆడపిల్లలు వద్దనుకుని పురుట్లోనే చంపేసి చేతులు దులుపుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో రోజుకొక చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇకపోతే.. మహారాష్ట్ర లతూర్ ప్రాంతంలో ఓ మహిళ నివాసం ఉంటుంది. గతంలో ఇదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో ఆ మహిళకు వివాహం జరిగింది. పెళ్లైన ఏడాదికి ఈ దంపతులకు ఆడపిల్ల పుట్టింది. ఇక పుట్టిన పిల్లను ఆ దంపతులు బాగానే చూసుకున్నారు. ఇదిలా ఉండగా ఆ మహిళ గర్భం దాల్చి ఇటీవల రెండవ కాన్పులో కూడా ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఇక రెండవ కాన్పులో కూడా ఆడపిల్లే జన్మించడంతో ఆ మహిళ తీవ్ర కలత చెందింది.
ఈ క్రమంలోనే ఆ మహిళ ఆడ పిల్ల వద్దనుకుని దారుణమైన నిర్ణయం తీసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ మూడు రోజుల పసికందును గొంతు పిసికి దారుణంగా చంపేసింది. ఈ విషయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మహిళను ప్రశ్నించారు. పోలీసుల రాకతో నోట్లో నీళ్లు నమిలిన ఆ మహిళ ఎట్టకేలకు అసలు నిజాన్ని ఒప్పుకుంది. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ మహిళను అరెస్ట్ చేశారు. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. మూడు రోజుల పసికందును దారుణంగా హత్య చేసిన ఈ కసాయి తల్లి చర్యపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.