ప్రభుత్వాలు ఎన్ని కఠినమైన చట్టాలు రూపొందించినప్పటికి బాలికపై అత్యాచార దాడులు మాత్రం ఆగటం లేదు. తాజాగా మహారాష్ట్రలో వెలుగు చూసిన ఇలాంటి ఘటనే రాష్ట్ర వ్యాప్తంగా సంచనలంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గోందియా జిల్లాలో ఆమ్గావ్ తాలూకాలోని కుంభార్ టోలా అటవీ ప్రాంతం. ఇదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు పూలు కోసేందుకు అడవిలోకి వెళ్లారు. అలా వారు పూలు కొస్తున్న సమయంలో సగానికపైగా కాలిన ముఖం, ఒంటిపై ఎలాంటి దుస్తువులు లేకుండా ఓ 15 ఏళ్ల బాలిక కనిపించటంతో వారు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
వెంటనే స్థానిక పోలీసులకు సమచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అంతా పరిశీలించారు. ఇక ఆ బాలికపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ తో కాల్చి అత్యాచారం చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.