ఎంతో సంతోషంగా సాగుతున్న భార్యాభర్తల వైవాహిక జీవితంలోకి అక్రమ సంబంధాలు వచ్చి చేరి ఊహించని విషాదాన్ని మిగిల్చుతున్నాయి. భర్తను కాదని భార్య, భార్యని కాదని భర్త. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు వివాహేతర సంబంధాల్లో తలదూర్చుతూ చివరికి పచ్చని సంసారంలో నిప్పులు పోసుకుంటున్నారు. ఇలాంటి వివాహేతర సంబంధాల కారణంగా ఎంతో మంది భార్యాభర్తలు ఆత్మహత్యలు, హత్యలు అంటూ సంసారాలను నాశనం చేసుకుంటున్నారు. సరిగ్గా ఇలాగే భర్తకు తెలియకుండా ప్రియుడితో కునుకులాడిన ఓ భార్య కథలో చివరికి ఊహించని దారుణం చోటు చేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగ మారింది. ఈ క్రైమ్ స్టోరీలో అసలు ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం నాగర్ దొడ్డి. ఇక్కడే వెంకట రాములు అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి చాలా ఏళ్ల కిందటే ఓ మహిళతో వివాహం జరిగింది. ఇక పెళ్లైన కొంత కాలం నుంచి వెంకట రాములు భార్యతో వైవాహిక జీవితాన్ని సాఫీగానే సాగిస్తూ వచ్చాడు. ఇదిలా ఉంటే వెంకట రాములు, ఇదే గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి స్నేహితులుగా ఉండేవారు. దీంతో రాజు అప్పుడప్పుడు వెంకట రాములు ఇంటికి వస్తుండేవాడు. అలా వస్తున్న క్రమంలో రాజు తన స్నేహితుడి భార్యపై కన్నేశాడు. ఎలాగైన వెంకట రాములు భార్యతో ఎంజాయ్ చేయాలని అనుకున్నాడు. దీంతో రాజుతో కునుకులాటకు వెంకట రాములు భార్యకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం.
అయితే కొన్నాళ్ల పాటు వీరిద్దరి చీకటి సంసారం బయటకు పొక్కకుండా తగు జాగ్రత్తలు పాటించారు. కానీ కొన్నాళ్ల తర్వాత రాజు తన భార్యతో సాగిస్తున్న చీకటి కాపురం వెంకట రాములుకు తెలిసింది. దీంతో రాములు ఇద్దరికి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఇక నుంచి బుద్దిగా ఉంటారంటూ అనుకున్నాడు. కానీ ఇవేవి పట్టించుకోని రాజు వెంకట రాములు భార్యతో మళ్లీ కలవడం మొదలు పెట్టాడు. ఇదిలా ఉంటే శనివారం రాత్రి వెంటక రాములు చర్చికి వెళ్లాడు. ఇదే మంచి సమయం అనుకున్న రాజు.. ప్రియురాలితో బాత్రూంలోకి దూరిపోయాడు.
ఇదే విషయం వెంకట రాములు సోదరుడికి తెలిసింది. వెంటనే తన సోదరుడు అయిన వెంకట రాములుకు తెలియజేశాడు. ఇక కోపంతో ఊగిపోయిన రాములు తన భార్యతో బాత్రూంలో నగ్నంగా కనిపించిన రాజును రాములు గొడ్డలితో దారుణంగా హత్య చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రాజును అతని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకపోవడంతో రాజు ప్రాణాలు విడిచాడు. ఇదే విషయం చివరికి పోలీసుల వరకు వెళ్లింది. వెంటనే స్పందించిన పోలీసుల ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.