అతడు భార్యను అమితంగా ప్రేమించాడు.. పెళ్లికి ముందే ఆమె మరొకరిని ప్రేమించిందని.. వివాహం తర్వాత కూడా అతడితో మాట్లాడుతుందని తెలిసినా కూడా భరించాడు. ప్రేమతో ఆమెను మార్చుకోవాలనుకున్నాడు. కానీ తాను ఆశించిన ఫలితం రాకపోవడంతో.. చివరకు తన జీవితాన్నే అంతం చేసుకున్నాడు. చనిపోయేముందు భార్యను ఉద్దేశించి రాసిన సూసైడ్ నోట్ ప్రస్తుతం వైరలవుతోంది. ఆ వివరాలు..
మధ్యప్రదేశ్ శివపురి జిల్లా కొత్వాలి ప్రాంతంలోని ఖుదా బస్తీకి చెందిన ఆకాశ్ షాక్యా (30)కి రెండేళ్ల క్రితం పెళ్లయింది. పెళ్లైన తర్వాత కొన్నాళ్ల పాటు భార్యాభర్తలు బాగానే ఉన్నారు. కానీ ఆకాశ్ భార్య పెళ్లికి ముందే మరో వ్యక్తితో ప్రేమలో ఉందని అతడికి తెలిసింది. ఐనప్పటికీ ఆమెను బాగా చూసుకున్నాడు. తన ప్రేమతో ఆమెను మార్చుకోవాలని అనుకున్నాడు. కానీ ఇటీవల ఆమె ఆకాశ్‌ని వదలిపెట్టి గ్వాలియార్లోని పుట్టింటికి వెళ్లిపోయింది.ఆకాశ్ కూడా గ్వాలియార్ వెళ్లి.. భార్యను తనతో పాటు రావాల్సిందిగా కోరాడు. కానీ ఆమె అంగీకరించలేదు. పుట్టింట్లోనే ఉంటానని స్పష్టం చేసింది. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆకాశ్.. తాను అద్దెకు ఉంటున్న ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సందర్భంగా అతడు రాసిన సూసైడ్ నోట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిలో ఆకాశ్.. తనకు భార్య అంటే ఎంత ప్రేమో వివరించాడు. భార్య కోసం ఒక్కసారి కాదు 100 సార్లు మరణించడానికి అయినా సంతోషమే అని తెలిపాడు. భార్య ప్రేమించిన వాడితో ఇప్పటికి మాట్లాడుతుందని.. అయినా తాను తనని ఎంతో ప్రేమించానని తెలిపాడు.
ఇక తన భార్య.. ఆమె చెల్లి, తల్లి మాటలు విని.. తనను వదిలేసి వెళ్లిందని.. తన జీవితంలో భార్యను తప్ప మరేవరిని ఊహించుకోలేనని.. ఇక తన భార్య అయినా నచ్చినవాడితో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాని రాసుకొచ్చాడు. తన ఆత్మహత్యక, ఇంటి ఓనర్‌కు ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు. అమ్మ నన్ను క్షమించు అని కోరాడు. ఆకాశ్ రాసిన లేఖ ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.