భార్యాభర్తల మధ్య జరిగిన గొడవల్లో ఎక్కువగా భర్తలదే పై చేయి ఉంటుంది. భర్త కొట్టాడని, వేధింపులకు గురి చేస్తున్నాడని ఇలా అనేక రకాల కారణాలతో భర్తపై భార్యలు ఫిర్యాదు చేస్తుండడం మనం అనేకం చూసి ఉంటాయి. కానీ మధ్యప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన మాత్రం పూర్తిగా దీనికి విరుద్దంగా ఉంది. భార్య కంట్లో కారం పోసి కొడుతుందని ఓ భర్త స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
ఇక విషయం ఏంటంటే? మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లా రితోరా సమీపంలోని ఓ గ్రామం. ఇదే ప్రాంతానికి చెందిన సంజయ్ సింగ్‌కు గ్వాలియర్‌లోని మహల్‌గావ్ ప్రాంతానికి చెందిన పూజతో రెండేళ్ల క్రితం వివాహమైంది. సంజయ్ మలాన్‌పూర్‌లోని ఓ ఫ్యాక్టరీలో ప్లంబర్‌గా పనిచేస్తూ కాపురాన్ని నెట్టుకుంటూ వచ్చేవాడు. అయితే పెళ్లైన నాటి నుంచి వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. కానీ గత కొన్ని రోజుల నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి.ఆ తర్వాత క్రమంగా విభేదాలు కూడా వచ్చి చేరాయి. దీంతో భార్య అత్తామామలతో కలిసి మెలిసి ఉండలేపోవడం, ఇంట్లో పనులు చేయలేకపోవడం వంటివి చేసేదట. ఇక ఇంతటితో ఆగకుండా అత్తింటి వారిపై నోటికొచ్చినట్లు తిట్టినట్లు కూడా తెలుస్తోంది. ఇదిలా ఉంటే మూడు నెలల కిందట సంజయ్ ఉద్యోగం కూడా కోల్పోయాడు. దీంతో ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవలు మరింత ఎక్కువయ్యాయి. ఇక కోపంతో ఊగిపోయిన భర్త సంజయ్ భార్యపై చేయి చేసుకున్నాడు. ఇక మనస్థానికి గురైన భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.
ఇది కూడా చదవండి: Jagathgiri Gutta: పది రోజులకొకసారి ప్రియుడు ఇంటికి ప్రియురాలు.. ఈ సారి వెళ్లింది కానీ తిరిగిరాలేదు!
దీంతో సర్దిచెప్పేందుకు వెళ్లిన భర్తపై తన తమ్ముళ్లతో కలిసి భార్య భర్తను చితికొట్టించింది. ఇంతటితో ఆగని భార్య భర్త కంట్లో కారం పోసి దాడికి పాల్పడింది. దీంతో భర్త తీవ్ర అవమానంగా భావించి మనస్థాపానికి గురయ్యాడు. చేసేదేం లేక స్థానిక పోలీసులకు.. నా భార్య కంట్లో కారంపోసి కొట్టింది.. ఆమె నుంచి కాపాడాలంటూ ఫిర్యాదు చేశాడు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు భార్యతో పాటు దాడి చేసిన ఆ మహిళ తమ్ముళ్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.