ప్రేమ పేరుతో నేటి కాలం యువత విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ప్రేమిస్తున్నామని వెంటపడటం, ఇక అవసరం తీరాక బ్రేకప్ చెప్పడం వంటి ఘటనలు అనేకం చోటు చేసుంటున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఎంతో గాఢంగా ప్రేమించుకున్న కొందరు ప్రేమికులు కుల, మతాలు వేరైన పెళ్లి పేరుతో కొందరు ఒక్కటవుతున్నారు. ఇలా ఓ మహిళను ప్రేమిస్తున్నానని వెంటపడ్డ ఓ వ్యక్తి చివరికి కోరికలు తీరాక కాదు పోమన్నాడంతో పాటు మతం పేరుతో దూరం చేయబోయాడు.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్‌లోని అశోకనగర్ లో నిహల్ ఖాన్(30) అనే వ్యక్తి ఆసుపత్రిని నడిపిస్తున్నాడు. అయితే గతంలో భర్తతో విడిపోయిన ఓ మహిళ అదే ఆస్పత్రిలో ఫిజియోథెరిపిస్టుగా పని చేస్తుంది. కాగా కొన్ని రోజుల తర్వాత వీరిద్దరి మధ్య కాస్త క్లోజ్ నెస్ పెరిగింది. దీంతో ఆ మహిళను ఆ డాక్టర్ ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు.
ఇది కూడా చదవండి: Shahinath Gunj: బేగంబజార్ పరువు హత్య.. నిందితుల దగ్గరకు సంజన, నీరజ్ కుటుంబసభ్యులు
ఇక కొన్నాళ్లకి డాక్టర్ ప్రేమకు ఆ మహిళ పచ్చ జెండా ఊపింది. దీంతో ఎంచక్కా ఇద్దరు రెస్టారెంట్లు, సినిమాలు అంటూ తెగ తిరిగారు. ఇక కొన్ని రోజుల తర్వాత ఆ మహిళ పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చే సరికి ఆమె ప్రియుడు ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. దీంతో ఎలాగైన ఆ మహిళను వదిలించుకోవాలని భావించి నేను ముస్లీం మతానికి చెందినవాడినని, నీతో పెళ్లి చేసుకోవడం అంతా కరెక్ట్ కాదంటూ కాదు పోమన్నాడు.
ప్రియుడి మాటలు విన్న ప్రియురాలు ఒక్కసారిగా షాక్ కు గురైంది. పెళ్లి చేసుకుంటానని చెప్పి లోబరుచుకుని ఇప్పుడు కాదంటున్నాడని ఆ మహిళ లోలోపల కుమిలిపోయింది. ఏం చేయాలో అర్థం కాక స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.