మధ్య ప్రదేశ్ లో ఎవరూ ఊహించని దారుణం వెలుగు చూసింది. మద్యం మత్తులో ఉన్న ఓ బీజేపీ లీడర్.. భార్య అని కూడా చూడకుండా బరితెగించి ప్రవర్తించాడు. ఇంతకు అతడు ఏం చేశాడో తెలుసా?
మధ్య ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ బీజేపీ నాయకుడు మద్యం మత్తులో బరితెగించి ప్రవర్తించాడు. కట్టుకున్న పెళ్లాం అని కూడా చూడకుండా ఎవరూ ఊహించని పని చేశాడు. ఇతని దారుణంపై స్పందించిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ గురవుతున్నారు. వీళ్లే కాకుండా పార్టీ నేతలు, కార్యకర్తలు సైతం ఇతడు చేసిన పనికి నోరెళ్లబెట్టారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఇంతకు అతడు చేసిన దారుణం ఏంటి? అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. మధ్య ప్రదేశ్ భోపాల్ లోని సాయినగర్ ప్రాంతం. ఇక్కడే చంద్రశేఖర్ పాండే అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి చాలా ఏళ్ల కిందటే ఓ మహిళతో వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఈ దంపతులు సంతోషంగానే ఉన్నారు. ఇక వీరి కూతుళ్లకు పెళ్లిళ్లు కూడా చేశారు. చంద్రశేఖర్ పాండే స్థానిక బీజేపీ నాయకుడిగా ఉంటూ ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే.., సోమవారం మధ్యాహ్నం చంద్రశేఖర్ పాండే ఫుల్ గా మద్యం సేవించి ఇంటికొచ్చాడు. ఈ క్రమంలోనే అతడు ఏదో విషయమై తన భార్యతో గొడవకు దిగాడు. దంపతులు ఇద్దరు కాసేపు గొడవ పడ్డారు.
ఈ క్రమంలోనే కోపంతో ఊగిపోయిన పాండే.. ఇంట్లో ఉన్న తుపాకీతో భార్యను కాల్చాడు. ఈ ఘటన సమయంలో కూతురు, అల్లుడు కూడా ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తుంది. ఇక భార్య చనిపోయిందని తెలుసుకున్న భర్త.. భయంతో అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే మృతురాలి కూతురు పోలీసులకు సమాచారం అందించింది. హుటాహుటిన ఘటానా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారింది.