వేధిస్తున్నాడన్న కారణంతో ఓ భార్యాభర్తలు ఊహించని దారుణానికి పాల్పడ్డారు. దంపతులు ఇద్దరు వేధింపులకు గురి చేస్తున్న వ్యక్తిని నమ్మించి ఇంట్లోకి భోజనానికి పిలిచారు. అనంతరం రాగానే ఆ యువకుడి ప్రైవేట్ పార్ట్ ను కోసేశారు. తాజాగా మధ్య ప్రదేశ్ లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ లో ఓ దంపతులు కాపురం పెట్టారు. పెళ్లైన నాటి నుంచి వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. ఇదిలా ఉంటే ఈ దంపతులు నివాసం ఉంటున్న వీధిలోని ఓ యువకుడు తన భార్యతో తరుచు మాట్లాడటానికి ప్రయత్నం చేసేవాడు.
దీనికి తన భార్య కూడా ఆ యువకుడితో మాట్లాడే ప్రయత్నం చేసింది. వీరిద్దరూ మాట్లాడుకోవడం ఆమె భర్త చూసి మందలించడంతో భార్య అతనితో మాట్లాడడం పూర్తిగా మానేసింది. అయినా కూడా ఆ యువకుడు ఆ మహిళతో మాట్లాడేందుకు ప్రయత్నించి వేధింపులకు గురి చేసేవాడు. దీంతో తట్టుకోలేకపోయిన ఆ వివాహిత భర్త ఎలాగైన అతనిపై దాడి చేయాలనే నిర్ణయానికి వచ్చాడు. ఇందులో భాగంగానే ఇటీవల ఆ యువకుడిని ఇద్దరు దంపతులు నమ్మించి ఇంట్లో భోజనానికి పిలిచారు. ఇది నమ్మిన ఆ యువకుడు ఎగేసుకుని వచ్చాడు. దీంతో ఆ దంపతులు వారు అనుకున్న ప్లాన్ ను అమలు పరిచేందుకు రెడీగా ఉన్నారు.
ఇది కూడా చదవండి: పెళ్లైన రెండు నెలలకే నవ వధువు దారుణం.. ప్రియుడిని ఇంట్లోకి పిలిచి!
ఆ యువకుడు రాగానే ఇంటి తలుపులు పెట్టారు. అనంతరం ఆ భార్యాభర్తలు ఆ యువకుడి బట్టలు పూర్తిగా విప్పేశారు. ఆ తర్వాత కత్తితో అతని జననంగాన్ని కోసేశారు. దీంతో ఆ యువకుడు అరుపులు, కేకలు వేయడంతో ఏం జరిగిందంటూ స్థానికులు పరుగు పరుగునా వచ్చారు. రక్తపు మడుగులో ఉన్న ఆ యువకుడిని గమనించి వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం బాధితుడి ఆరోగ్య పరిస్థితి క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.