ప్రస్తుతం ఆధునిక కాలంలో ఏదైన వేడుక జరిగితే డీజేలు పెట్టడం సర్వసాధారణం అయిపోయింది. ఇక పెళ్లి భరాత్ లో అయితే డీజే ఉండి తీరాల్సిందే. మాస్ బీట్ లతో కుర్రాళ్లు అంతా తమను తాము మరచి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అలా డ్యాన్స్ చేస్తున్నక్రమంలో అప్పుడప్పుడు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఈక్రమంలో ఒళ్లు జలదరించే సంఘటన ఒకటి మధ్యప్రదేశ్ లో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ జిల్లా మేమ్దీ గ్రామంలో సోమవారం ఈ సంఘటన జరిగింది. పవిత్ర శ్రావణ మాసంలో మార్వాడీలు కావడి యాత్ర నిర్వహిస్తారు. అందులో భాగంగానే సోమవారం కావడి యాత్రను ప్రారంభించారు. ఆవేడుకలో కొంత మంది యువకులు డీజేలను పెట్టి డ్యాన్స్ చేస్తూన్నారు. ఈ క్రమంలోనే వారికి అనుకోని సంఘటన ఎదురైంది.
డీజే మ్యూజిక్ కు తమను తాము మరచి యువకులంతా డ్యాన్స్ చేస్తున్నారు. అయితే మౌ సిమ్రోల్ రహదారి పక్కన డీజే వ్యాన్ లను ఆపారు. యువకులు ఆ వ్యాన్ లపైకి ఎక్కి డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంతలో ఒక యువకుడి చెయ్యి పైన ఉన్న హైటెన్షన్ కరెంట్ వైర్ కు తగిలింది. దీంతో ఒక్కసారిగా షాక్ తగలడంతో అక్కడికక్కడే 5గురు కుప్పకూలారు.
వెంటనే వ్యాన్ ను పక్కకి జరిపి వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒకరు మరణించగా, మిగిలిన వారు చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనతో ఒక్కసారిగా ఆ ఊరిలో విషాదచాయలు అలుముకున్నాయి. అందుకే అంటారు పెద్దలు అత్యుత్సాహాం పనికిరాదని. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.