ఈ మద్య కాలంలో వరుసగా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. రైల్వే ఫ్లాట్ ఫామ్ పై నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు అని రైల్వే అధికారులు ప్రయాణికులకు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ పెడచెవిన పెట్టి ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు.
మనిషి ప్రాణాలు ఎప్పుడు ఎలా పోతాయో ఎవరూ చెప్పలేరు. ఈ మద్య గుండెపోటు మరణాలు, రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది చనిపోతున్నారు. అప్పటి వరకు మన కళ్ల ముందు ఉన్నవాళ్లు హఠాత్తుగా కానరాని లోకాలకు వెళ్తున్నారు. ఇక రైల్వే ప్లాట్‌ఫాంపై ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి.. అధికారులు ఎన్ని హెచ్చరికలు చేసినా కొంతమంది నిర్లక్ష్య వైఖరి వల్ల ప్రాణాలు బలి చేసుకుంటారు. ఇద్దరు యువకులు రైల్ ఫ్లాట్ ఫామ్ వద్దకు వచ్చి చేయి శుభ్రం చేసుకుంటుండగా ట్రైన్ ఢీ కొట్టింది. ఈ ఘటన ముంబాయిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
రైల్వే ప్లాట్‌ఫాంపై అప్రమత్తంగా ఉండాలని.. రైల్ వస్తున్న సమయంలో దూరంగా ఉండాలని రైల్వే అధికారులు ఎన్నోసార్లు హెచ్చరిస్తుంటారు. కానీ కొంతమంది మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా కదిలే ట్రైన్ ఎక్కడం, ఫ్లాట్ ఫామ్ వద్ద నిర్లక్ష్యంగా వ్యవహరించడం చేస్తుంటారు. అలాంటి సందర్భాల్లో రైలు ప్రమాదాలు జరుగుతుంటాయి.. అదృష్టం బాగుంటే బతికిపోతారు.. లేదంలే ఎంతో మంది చనిపోయిన ఘటనలు ఉన్నాయి. తాజాగా ముంబాయిలోని మలాడ్ రైల్వే స్టేషన్ విషాదం చోటు చేసుకుంది. మయాంక్ (17) అనే యువకుడు ఫ్లాట్ ఫామ్ అంచున నిలబడి వెనుక వైపు వస్తున్న రైల్ ని గమనించకపోవడంతో.. వెనకవైపు నుంచి వచ్చిన ట్రైన్ యువకుడిని బలంగా ఢీ కొట్టి ప్రాణాలు కోల్పోయాడు.
ముంబాయిలోని మలాడ్ రైల్వే స్టేషన్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డు అయ్యాయి. వీడియో పరిశీలిస్తే.. ఈ నెల 17న మధ్యాహ్నం ఓ విద్యార్థి రైల్వే ఫ్లాట్ ఫామ్ అంచున నిల్చొని చేతులు శుభ్రం చేసుకుంటున్నాడు. మయాంక్ అనే యువకుడు అక్కడికి వచ్చి తన స్నేహితుడి వద్ద వాటర్ బాటీల్ తీసుకొని మంచినీళ్లు తాగబోయాడు. అంతలోనే వెనుక నుంచి లోకల్ రైల్ అతి వేగంగా దూసుకు వచ్చి బలంగా మయాంక్ కి ఢీ కొట్టింది. దాంతో అల్లంత దూరాన ఎగిరిపడి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ.. ప్లాట్‌ఫాంలపై జాగ్రత్తగా ఉండాలంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.