హైదరాబాద్ లో గత కొన్ని రోజుల నుంచి చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే నగరంలో ఉప్పల్ తో పాటు మరో రెండు మూడు చోట్ల చైన్ స్నాచింగ్ కు పాల్పడి పోలీసులకు చుక్కలు చూపించారు. రోడ్డుపై ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకుని మెడలో ఉన్న బంగారు గొలుసులు లాక్కెళ్తున్నారు. అయితే తాజాగా ఎల్బీ నగర్ లోనూ చైన్ స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు. రోడ్డుపై ఒంటరిగా కనిపించిన మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దీంతో అలెర్ట్ అయిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన సంచలనంగా మారుతుంది.
హైదరాబాద్ ఎల్బీ నగర్ పరిధిలోని కాకతీయ కాలనీలో ఓ మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంది. ఈ క్రమంలోనే ఈ ఆమె వెనకాలే ఓ దొంగ హెల్మెట్ పెట్టుకుని బైక్ పై వస్తూ ఆ మహిళను గమనించాడు. ఇదే మంచి సమయం అనుకున్న ఆ యువకుడు అటు ఇటు చూసి ఓ చోట బైక్ ఆపాడు. ఆ తర్వాత వెంటనే ఆ మహిళ వద్దకు పరుగెత్తి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు లాగేశాడు. దీంతో ఏం జరిగిందని ఆ మహిళ వెనక్కి తిరిగి చూసేసరికి వెంటనే ఆ యువకుడు బైక్ పై ఎక్కి అక్కడి నుంచి పరారయ్యారు.
దీంతో లబోదిబో మంటూ ఆ మహిళ నెత్తినోరు బాదుకుంది. ఇదంతా స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అనంతరం ఆ మహిళ వెంటనే ఎల్బీ నగర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. గత కొన్ని రోజుల నుంచి నగరంలో వరుస చైన్ స్నాచింగ్ ఘటనలు పోలీసులకు సవాల్ గా మారుతున్నాయి. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఎల్బీనగర్ లోని కాకతీయ కాలనీలో 50 ఏళ్ల మహిళ మెడలో 2 తులాల బంగారం చోరీ. pic.twitter.com/a432OZGMsc
— Telugu Scribe (@TeluguScribe) January 13, 2023