శారీరక సుఖం కోసం పవిత్రమైన వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెడుతూ వివాహేతర సంబంధం వైపు పరుగులు తీస్తున్నారు కొందరు. ఈ సంబంధాలు ఏదో ఒకరోజు విషాదాంతానికి దారి తీస్తాయని తెలిసినా తమ తీరు మాత్రం మార్చుకోవడం లేదు. తాజాగా.. బెంగళూరులో ఇలాంటి ఘటనే జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. రాయచూర్‌కు చెందిన జ్యోతి, రాము భార్యాభర్తలు. వీరికి ఆరేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లైన తర్వాత బెంగళూరులోని కొడిగెనహళ్లిలో ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం పెట్టారు. పెళ్లయి ఆరేళ్లు అవుతున్నప్పటికీ ఈ జంటకు పిల్లలు లేరు. ఈ విషయంలో భార్యాభర్తలిద్దరు గత కొంత కాలంగా అసంతృప్తితో ఉన్నారు.
ఇది కూడా చదవండి : భార్య స్నానం చేస్తున్న వీడియోను వాట్సప్ స్టేటస్‌లో పెట్టిన భర్త!
ఈ క్రమంలో.. జ్యోతికి ట్యాక్సీ డ్రైవర్ అయిన బసవరాజుతో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. అది కాస్తా శృతిమించడంతో ప్రియుడు బసవరాజుతో కలిసి జ్యోతి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇద్దరు కలిసి భార్యాభర్తలమని చెప్పి దేవనహళ్లిలోని శాంతినగర్‌లో ఇల్లు కూడా తీసుకున్నారు. ఇల్లు అద్దెకు తీసుకున్న జంట గత ఆదివారం నుంచి కనిపించకుండాపోవడం, ఇరుగుపొరుగు వారికి ఆ ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో అనుమానమొచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ ఇంటి తలుపులు బద్ధలు కొట్టి చూడగా ఇంట్లో ఆ జంట ఆత్మహత్య చేసుకుని కనిపించారు.
ఈ ఘటనపై దేవనహళ్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. దర్యాప్తులో కొన్ని కీలక విషయాలు వెలుగుచూశాయి. అసలు వాళ్లిద్దరు భార్యాభర్తలు కాదని తెలిసింది. ఆమెకు గతంలో వేరొకరితో పెళ్లైందని, భర్తను వదిలేసి ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్న ఈ యువకుడితో వచ్చేసినట్లు విచారణలో తేల్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.