కోటి విద్యలు కూటి కోసం అంటారు. కానీ.., డబ్బు విషయంలో అత్యాశకి పోతున్న వారు మాత్రం సరికొత్త విద్యలను పుట్టిస్తున్నారు. అయితే.. ఇక్కడ అంతా మాయ, మోసం తప్ప ఇంకేమి ఉండదు. అలాంటి ఓ నయా మోసం ఒకటి ఆంధ్ర ప్రదేశ్ లో కర్నూలు జిల్లాల్లో వెలుగు చూసింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
కర్నూలు మండలం మిలటరీ కాలనీకి చెందిన తెలుగు జనార్ధన్, అలాగే శ్రీరామనగర్‌కు చెందిన బెస్త ప్రవీణ్‌కుమార్ చాలా కాలంగా స్నేహితులు. ఇద్దరికీ ఇంటర్నెట్ వాడకంపై మంచి అనుభవం ఉంది. కానీ.., సరైన సంపాదన లేదు. ఇలాంటి సమయంలో ఓ కొత్త మోసానికి తెర లేపారు. తమ ఫోన్ లో కొన్ని యాప్స్ ని వేసుకుని.. వాట్సప్ నుండి బల్క్ మెసేజ్ లే సెండ్ చేస్తారు. కాల్‌గర్ల్స్‌ను సరఫరా చేస్తాము, అశ్లీల వీడియో కాల్స్ చేయిస్తాము.. ఇందుకు రూ. 300 నుంచి రూ. 5,000 వరకు ఖర్చు అవుతుందన్నది ఆ మెసేజ్ లో ఉండే సారాంశం.
ఇలాంటి మెసేజ్ రోజుకి కొన్ని వేల మందికి సెండ్ చేస్తారు. వారిలో అందరూ కాకపోయినా.., కొందరు స్పందించినా వీరికి లక్షలు వచ్చి పడుతున్నాయి. అవతల వాళ్ళు డబ్బులు పంపాక.. ఇక వారిని బ్లాక్ చేయడం వీరికి అలవాటు. ఇలా ఇప్పటికే జనార్ధన్, ప్రవీణ్‌కుమార్ లక్షలు వెనకేసినట్టు తెలుస్తోంది. ఇలా ప్రజల బలహీనతతో బిజినెస్ చేస్తూ.. వీరు రోజుకి రూ.10 వేల నుంచి రూ. 20 వేల వరకు సంపాదిస్తున్నట్లు పోలీసుల దృష్టికి రావడంతో వారు రంగంలోకి దిగారు.
జొహరాపురం సబ్ స్టేషన్ వద్ద నిందితుడు తెలుగు జనార్ధ్దన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మాంటిస్సోరి స్కూల్ వద్ద ప్రవీణ్‌కుమార్ ను అరెస్ట్ చేశారు.యువత ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. మరి.., ఇలాంటి మోసాలు చేసే వారికి ఏ శిక్ష విధించాలి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.