నేటి కాలంలోని యువత చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా అమ్మాయిలు అయితే ప్రియుడు మోసం చేశాడని, తల్లిదండ్రులు మందలించారని, చదువులో రాణించలేకపోతున్నాననే ఇలాంటి కారణాలతో ఎంతో అమ్మాయిలు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. అచ్చం ఇలాగే ఆలోచించిన శ్రీహర్షిత ఆత్మహత్యకు పాల్పడి నిండు ప్రాణాలు తీసుకుంది. తాజాగా ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. వైజాగ్‌కు చెందిన విశ్వనాథం కూతురు హర్షిత (19) గత ఆరు నెలల క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చి కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీలో నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటుంది.
ఇక హర్షితతో పాటు అనన్య అనే మరో విద్యార్థినికి కాలేజీ హాస్టల్‌లో 206 నెంబర్ రూమ్ కేటాయించారు. కొన్ని రోజల నుంచి ఇద్దరు అదే రూముల్లో ఉంటున్నారు. అయితే గత ఆదివారం జేఈఈ మెయిన్స్ పరీక్ష ఉండటంతో అనన్యను తల్లిదండ్రులు వచ్చి తీసుకెళ్లారు. దీంతో హర్షిత తండ్రి విశ్వనాథం ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కళాశాలకు ఫోన్ చేసి కూతురితో మాట్లాడారు. అనంతరం హర్షిత రూమ్‌కి వెళ్లింది. ఇక కొద్దిసేపటి తర్వాత విద్యార్థులందరినీ యూనిట్ పరీక్షకు పిలుస్తున్నారని వార్డెన్ హర్షిత గదికి వెళ్లి పిలించింది.
ఇది కూడా చదవండి: Jubilee Hills: జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచారం కేసు.. నిందితులను గుర్తించిన బాలిక!
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తల్లిదండ్రులకు సమాచారాన్ని అందించారు. కూతురు మరణవార్త విన్న ఆ యువతి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నారు. చదువు ఒత్తిడి కారణంగానే శ్రీహర్షిత ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.