Mother And Son: ఈ సృష్టిలో ప్రత్యామ్నాయం లేనిది తల్లి ప్రేమ ఒక్కటే. ఓ తల్లి తన బిడ్డ కోసం ఎన్ని కష్టాలనైనా అనుభవిస్తుంది. తొమ్మిది నెలలు కడుపులో మోయటం మాత్రమే కాదు.. తను చనిపోయే వరకు కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటుంది. అలాంటి తల్లిపై కొంతమంది కొడుకులు దారుణాలకు పాల్పడుతున్నారు. కన్న తల్లి అన్న ప్రేమ ఏ మాత్రం లేకుండా ప్రవర్తిస్తున్నారు. అసలు వారిని మనుషులుగా కూడా చూడ్డంలేదు. తాజాగా, ఓ డాక్టర్ తన తల్లి రెండు కాళ్లను విరగ్గొట్టాడు. అడిగినంత డబ్బులు ఇవ్వలేదని ఈ ఘోరం చేశాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు.. ఖమ్మం జిల్లాలోని వైరా మున్సిపాలిటీ, బోడె కాలనీకి చెందిన గద్దల వెంకటరత్నం.. తన కుమారుడు అనకర్, కోడలు మాధవితో కలిసి ఉంటోంది.
కుమారుడు ఓ స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్‌గా పని చేస్తున్నాడు. డబ్బుల కోసం తరచూ తల్లితో గొడవ పడేవాడు. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం 20 వేల రూపాయలు ఇవ్వాలని తల్లితో గొడవకు దిగాడు. ఆమె డబ్బులు లేవని చెప్పటంతో కర్రతో దాడి చేశాడు. విచక్షణా రహితంగా కొట్టాడు. ఈ దాడిలో ఆమె రెండు కాళ్లు విరిగిపోయాయి. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.
ఇది గమనించిన స్థానికులు వెంకటరత్నంను ఆసుపత్రికి తరలించారు. అక్కడ రెండు కాళ్లకు కట్టు కట్టించారు. అనంతరం ఆమె తన కుమారుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుమారుడినుంచి రక్షణ కల్పించాలని కోరింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలిని మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Bengaluru: భార్య నగ్న ఫోటోలను బంధువులకు పంపిన సైకో భర్త! ఎందుకో తెలుసా?