గుడుంబా తయారీ, గంజాయి సాగుపై నిషేధం విధించినప్పటికి స్మగ్లర్లు వాటిని రవాణా చేస్తూ పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నారు. ఇలాంటి వారిని పట్టుకునేందుకు అబ్కారీ పోలీసులు కూలీల వేషం ధరించి స్మగ్లర్ల ఆటకట్టించారు.
ప్రస్తుతం సొసైటీని పట్టిపీడిస్తున్న మహమ్మారి డ్రగ్స్. మధ్యానికి, మాధక ద్రవ్యాలకు యువత బానిసలై భవిష్యత్ ను అందకారం చేసుకుంటున్నారు. డ్రగ్స్ మత్తులో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కాగా వీటి నియంత్రణకు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికి డ్రగ్స్ సరఫరా మాత్రం ఆగడం లేదు. డ్రగ్స్ సరఫరా చేసే వారు పోలీసుల కళ్లు గప్పి తప్పించుకు తిరుగుతున్నారు. ఈ క్రమంలో గుడుంబ, గంజాయి రవాణా చేస్తున్న వారిని సినిమా స్టైల్లో వెంబడించి వారి ఆటకట్టించారు అబ్కారీ పోలీసులు. అబ్కారీ పోలీసులు తీసుకున్న ఆ నిర్ణయంతో స్మగ్లర్లు దొరికిపోయారు. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
మధ్యం తీసుకోవడం, డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యాలు పాడవుతాయని, కుటుంబాలు చిన్నాబిన్మమవుతాయని అధికారులు హెచ్చరించినప్పటికి వారి సూచనలను పట్టించుకోకుండా కొందరు వాటిని వినియోగిస్తుంటారు. గుడుంబ, గంజాయిని సరఫరా చేసే వారిపట్ల ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. గుడుంబ పెట్టే వారిపై కేసులు పెట్టి భారీ జరిమానాలను విధిస్తుంది. అయినప్పటికి గుడుంబ తయారీ ఆగడం లేదు. గంజాయి సరఫరా ఆగడం లేదు. అయితే గుడుంబా తయారీ దారులను ఎలాగైన పట్టుకోవాలని భావించిన పోలీసులు కూలీల వేషం కట్టి వారిని కటకటాలపాలు చేశారు.
గుడుంబ తయారు చేయడం, అమ్మడాన్ని ప్రభుత్వం నిషేధించినప్పటికి ఖమ్మం జిల్లాలో యధేశ్చగా వీటి వ్యాపారం సాగుతుంది. వీరిపై నిఘా పెట్టిన ఖమ్మం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ అబ్కారీ పోలీసులు గంజాయి, గుడుంబాను రవాణా చేసే స్మగ్లర్లను పట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీనిలో భాగంగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుడుంబా తయారీదారులను పట్టుకునేందుకు వెళ్లిన అబ్కారీ పోలీసులకు ఆనవాళ్లు దొరక కుండా చేసి తప్పించుకు తిరుగుతున్నారు స్మగ్లర్లు. దీంతో అబ్కారీ పోలీసులు సిఐ, ఎస్ ఐ, కానిస్టేబుళ్లు కూలీల వేషం కట్టారు. గుడుంబా ఎక్కడ తయారీ చేస్తున్నారు, గంజాయి ఎవరు సరఫరా చేస్తున్నారు అనే విషయాలను కూపీలాగారు. కొన్ని రోజులు తర్వాత ఆ స్మగ్లర్లను పట్టుకుని అరెస్ట్ చేశారు. మారు వేశంలో రిస్క్ చేసి స్మగ్లర్ల ఆటకట్టించిన అబ్కారీ పోలీసులను పై అధికారులు ప్రశంసించారు.