పంచాయితీ పెద్దల తీర్మానంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది. తాజాగా తెలంగాణలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?
పంచాయితీ పెద్దల ఊహించని తీర్మానంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది. తాజాగా తెలంగాణలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పంచాయితీ పెద్దల తీర్మానం ఏంటి? అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? అందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటనే పూర్తి వివరాలు మీ కోసం. అది తెలంగాణలోని ఖమ్మం జిల్లా కారేపల్లిలోని దుబ్బతాండ ప్రాంతం. ఇక్కడే తేజావత్ కవిత, ఆమె తమ్ముడు భద్యాలు నివాసం ఉంటున్నారు. అయితే ఇటీవల హోలీ పండగా రోజు అక్కా తమ్ముడు ఇద్దరూ గొడవ పడ్డారు.
ఇదే సమయంలో వారిన సముదాయించడానికి ప్యాంటీ అనే మహిళ జోక్యం చేసుకుంది. ఈ క్రమంలోనే ఆ గొడవ అడ్డం తిరిగి చివరికి ప్యాంటీ, కవిత కొట్టుకున్నారు. దీంతో ప్యాంటీ కింద పడి గాయాలపాలైంది. ఇక ఇదే కోపంతో ప్యాంటీ ఈ గొడవను పంచాయితీ పెదల వరకు తీసుకెళ్లింది. ఇక చర్చించిన పెద్ద మనుషులు.. కవితకు రూ.50 వేలు చెల్లించాలని, లేకుంటే పోలీసు కేసు పెడతామని బెదిరించారు. పంచాయితీ పెద్దల నిర్ణయంతో కవిత తీవ్ర మనస్థాపానికి లోనైంది.
ఆ సమయంలో ఆమెకు ఏం చేయాలో తెలియక ఆదివారం ఇంట్లో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. గమనించిన ఆమె కుటుంబ సభ్యులు కవితను వెంటనే ఖమ్మంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ కవిత సోమవారం ప్రాణాలు విడిచింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారంది.