సమాజంలో మానవతా విలువలు, వావి వరసలు అనే పదాలకు అర్థం లేకుండా పోతోంది. ఓ దుర్మార్గపు మేనమామ తన పంజా విసిరాడు. భర్త పోయిన బాధలో ఉన్న కోడలిపై మామ కన్నేశాడు. సొంత మేనకోడలను కొడుకు ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ తర్వాత విధి వక్రించి కొద్ది రోజులకే భర్త పోయాడు. ఆ తర్వాత కూతురిలా ఆమెను కాపాడుకోవాలి. సొంత మేనకోడలు కాబట్టి.. మరో అబ్బాయిని చూసి దగ్గరుండి పెళ్లి చేయాలి. కానీ, ఆ మామ అలా చేయలేదు.. తనని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. అందుకు ఒప్పుకోలేదని ఏకంగా హత్యాయత్నానికి దిగాడు. కత్తితో దాడి చేయగా.. అడ్డొచ్చిన ఆమె తల్లికి గాయాలయ్యాయి.
మరికొన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా చింతకాని మండలం రైల్వే కాలనీకి చెందిన ఓ వ్యక్తి తన కొడుకుకు.. సోదరి కుమార్తెను ఇచ్చి పెళ్లి చేశాడు. మేనబావ కాబట్టి ఆమె కూడా అందుకు అంగీకరించింది. కొద్ది రోజులు వారు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. కానీ, వారు తలచింది ఒకటైతే.. అక్కడ జరిగింది ఒకటి. కొన్నాళ్లకు ఆమె భర్త మృతిచెందాడు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమెను ఓదార్చాల్సిన స్థానంలో ఉన్న మేనమామ అలా చేయలేదు. తన లైంగిక వాంఛలు తీర్చుకునేందుకు ఆమెపై కన్నేశాడు. ‘కొడుకు పోతేనేం.. నేను లేనా?’ అంటూ మృగంలా వ్యవహరించాడు.
ఎక్కడన్నా కోడలు అందులోనూ మేనకోడలు కాబట్టి.. సొంత కూతురిలా చూసుకోవాలి. బయటి నుంచి తమ ఇంటికి కోడలిగా వచ్చిన అమ్మాయికే ఈ కష్టం వస్తే.. వేరే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసిన ఘటనలు చూశాం. అలాంటి బుద్ధి లేకపోయిన కనీసం మానవత్వం అయినా ఉండాలి. కానీ, ఆ వ్యక్తి ఆ రెండూ లేవు. వరసకు మేనమామ కావడంతో సిగ్గు లేకుండా అడిగేశాడు. నన్ను పెళ్లిచేసుకో.. నేను చూసుకుంటా నిన్ను అని. కానీ, అందుకు ఆ యువతి అంగీకరించలేదు. చిన్నప్పటి నుంచి ఎత్తుకుని పెంచిన నీకు ఇలాంటి ఉద్దేశం ఉండటం ఏంటని ప్రశ్నించింది. కొడుకు భార్యను ఇలాంటి దృష్టితో ఎలా చూస్తావంటూ వాపోయింది.
ఇదీ చదవండి: నర్స్ పై కన్నేసి.. కోరిక తీర్చుకోడానికి మాస్టర్ ప్లాన్!
మార్పు వస్తుందని భావించినా.. ఎంతకీ మామలో మార్పు రాలేదు. వేధింపులు ఇంకా ఎక్కువ చేశాడు. తన కోరికలు తీర్చాలంటూ.. తనని వివాహం చేసుకోవాలంటూ టార్చర్ పెట్టడం మొదలు పెట్టాడు. ఇంక మామ వేధింపులు అధికమవ్వడంతో ఆ యువతి విషయం తల్లిదండ్రులకు చెప్పేసింది. మొదట ఆ మాట విన్న తల్లిదండ్రులు భారీ షాక్ కు గురయ్యారు. వీడు ఇలా ఆలోచిస్తున్నాడా? అంటూ తెల్లమొఖం వేశారు. తేరుకుని నిలదీశారు. అప్పుడు ఆ మామ ఎదురు తిరిగాడు. వారితో ఘర్షణకు దిగాడు. పెళ్లికి అంగీకరించలేదన్న.. కోపంతో కోడలిపై హత్యాయత్నం చేశాడు. కత్తితో ఆమెపై దాడికి దిగాడు. కుమార్తెను పొడవ బోతుంటే ఆమె తల్లి అడ్డుపడింది. ఆ వ్యక్తి దాడిలో తన సొంత సోదరికి రెండు కత్తి పోట్లు దిగాయి.
ఆమెను ఖమ్మం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆ మేనమామపై తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు.