అది 2020.. మే 6వ తేదీ.. కేరళ రాష్ట్రంలోని కొల్లంలోని అంచల్ గ్రామం. అప్పుడే తెల్లారుతోంది. ఆ ఇంటి అల్లుడు సూరజ్ అందరికన్నా ముందుగా నిద్ర లేచాడు. పక్క బెడ్ పై నిద్రపోతున్న తన భార్య ఉత్తరని నిద్రలేపడానికి ప్రయత్నించాడు. కానీ.., ఆమె లేవలేదు. ఎంత ప్రయత్నించినా ఆమెలో చలనం లేదు. పైగా.., నోటి భాగంలో నురుగు, చేతికి పాము కాటు గుర్తులు ఉన్నాయి. అంతే.. తన భార్యని పాము కాటు వేసినట్టు అతనికి అర్ధం అయ్యింది. భార్య చనిపోయిన బాధతో రోదనలు చేస్తూ.., అత్తమామలను లేపాడు. తమ ఇంట్లోనే.. కన్న కూతురు చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధించారు. చివరికి బరువెక్కిన హృదయాలతో కూతురి అంత్యక్రియులు ముగించారు.
చనిపోయిన ఉత్తర అంధురాలు. కావాల్సినంత ఆస్తి ఉన్నా.., ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమెకి కళ్ళు తెప్పించలేకపోయారు తల్లిదండ్రులు. కానీ.., ఆమె పేరు మీద కావాల్సినన్ని ఆస్తులు పోగేశారు. బ్యాంక్ ఉద్యోగి అయిన సూరజ్ ని భర్తగా తీసుకొచ్చారు. కాపురంలో చిన్న చిన్న సాధారణ గొడవలు తప్ప, వారి జీవితం సజావుగానే సాగిపోతూ వచ్చింది. కానీ.., కూతురు ఇలా అకాల మరణం చెందటమే వారిని కృంగదీసింది. ఈ బాధలో ఉండగానే ఉత్తర తండ్రికి ఒక అనుమానం వచ్చింది.
నా కూతురు అంధురాలే గాని, మాటలు రాని వ్యక్తి కాదు కదా? పాము కాటు వేస్తే ఆమె పెద్దగా అరవాలి కదా? తనని ఏదో కుట్టిందని, నొప్పి పుడుతోందని పక్కనే ఉన్న తన భర్తకి చెప్పాలి కదా? మరి.. ఉత్తర అలా ఎందుకు అరవలేదు? అసలు నా కూతురిని పాము కరిచిందా? పాము కరిచేలా ఎవరైనా ప్లాన్ చేశారా? ఉత్తర చనిపోయిందా? లేక ఎవరైనా చంపేశారా? ఇలాంటి అనుమానాలు ఆ తండ్రి మదిని తొలిచేశాయి. ఎంత ఆలోచించినా.. ఆయన అనుమానం అంతా అల్లుడి దగ్గరికి వెళ్లి ఆగుతోంది. ఎలా అయినా.. తన కూతురి డెత్ మిస్టరీ తెలుసుకోవాలి అనుకున్నాడు. అంతే.. నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి అల్లుడి పై కంప్లైంట్ ఇచ్చాడు.
If you don’t like snakes, don’t watch. Kerala police tried to reconstruct Uthra’s murder using a live cobra and a dummy pic.twitter.com/NNwkSicbIi
— Dhanya Rajendran (@dhanyarajendran) August 26, 2021
పోలీసులు సూరజ్ ని విచారించారు. అతనిలో భార్య చనిపోయిన బాధ తప్పించి, ఏమి కనిపించడం లేదు. ఉత్తర చనిపోయిన నాటి నుండి మనిషి బక్క చిక్కిపోయాడు. ఒక్క మాటలో చెప్పాలంటే పిచ్చి వాడిలా తయారయ్యాడు. పోలీసులకి సూరజ్ ఈ పని చేసి ఉండడు అనిపించింది. దీంతో.., నిజాలు నిగ్గు తేల్చడానికి ఉత్తర బాడీకి మళ్ళీ శవ పరీక్షలు జరిపించారు కేరళ పోలీసులు. ఆ పరీక్షల్లో షాకింగ్ రిజల్ట్స్ వచ్చాయి.
ఉత్తర నిజంగానే పాము కాటుతో చనిపోయిందని ఆ టెస్ట్ లో తేలింది. కానీ.., ఆ కాటు అసాధారణంగా ఉంది. పాము ఎంతో కసిగా, పగతో కాటు వేసినంత లోతుకి గాయం అయ్యింది. మరి.., అంత బలంగా కాటు వేస్తే ఉత్తర ఎందుకు అరవలేదు? భర్తని ఎందుకు నిద్ర లేపలేదు? తల్లిదండ్రులను ఎందుకు పిలవలేదు? ఒకవేళ.. అరవడానికి వీలు లేకుండా, నొప్పి తెలియకుండా ముందే ఆమెకి మత్తు ఇచ్చి ఉన్నారా? నిద్ర మాత్రలు లాంటివి ఆమె చేత మింగించి, పక్కా..ప్లాన్ ప్రకారం పాము చేత ఆమెని కాటు వేపించి చంపేశారా? పోలీసుల ఆలోచనలు ఇలానే పరుగులు తీశాయి. దీంతో.., ఉత్తర భర్తని మాత్రమే కాదు, ఆమె తల్లిదండ్రులను సైతం అనుమానించారు పోలీసులు. అందరినీ పోలీస్ స్టేషన్ కి పిలిపించారు. ముందుగా సూరజ్ ని తమదైన స్టయిల్ లో విచారించారు. ఆ దెబ్బలకి తట్టుకోలేక అందరూ విస్తుపోయే నిజాన్ని బయటపెట్టాడు సూరజ్.
“అవును.. నా భార్య ఉత్తరని నేనే చంపేశాను. పాము పట్టే వ్యక్తి నుంచి ఓ పాముని కొనుగోలు చేశాను. ఆ విషపూరిత పాము చేత ఆమెను కాటు వేపించేలా చేశాను. అంతకన్నా ముందే ఆమె డీప్ స్లీప్ లో ఉండేలా.. నిద్ర మాత్రలు మింగించాను. తన పేరు మీద ఉన్న ఆస్తి కోసమే ఉత్తరని కడతేర్చాను” అని అసలు నిజాన్ని బయట పెట్టాడు సూరజ్. దీంతో.., కట్టుకున్న వాడే తమ కూతురి పాలిట కాల యముడుయ్యాడా అని ఉత్తర తల్లిదండ్రులు రోదించారు. కానీ.., ఇక్కడ నుండే పోలీసులకి ఈ కేసు సవాల్ గా నిలిచింది. సూరజ్.. తన నేరాన్ని అంగీకరించినా, అందుకు తగ్గ సాక్ష్యాలను మేజిస్ట్రీట్ ముందు పొందుపరచాల్సిన అవసరం పోలీసులకి ఏర్పడింది.
సూరజ్ భార్యని కడతేర్చినా.., అతను ఈ మర్డర్ కోసం ఎలాంటి ఆయుధం ఉపయోగించలేదు. ఇద్దరి మధ్య ఘర్షణ జరగలేదు. పైగా.., డైరెక్ట్ గా ఎలాంటి విష ప్రయోగం జరగలేదు. ఓ పాముని రెచ్చగొట్టి, భార్యని కాటు వేసేలా చేశాడు. ఇప్పుడు దీన్ని.. జడ్జ్ ముందు ఎలా ప్రూవ్ చేయాలి? సాక్ష్యాలను ఎలా సాధించాలి? కేరళ పోలీసులకి ఈ మొత్తం వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. మరోవైపు.. ఈ హత్య గురించి మొత్తం దేశం అంతా తెలిసిపోయింది. ప్రజల్లో ఆగ్రహపు జ్వాలలు రగిలాయి. కేరళలో వరకట్న వేధింపులను అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ విరుచుకుపడ్డారు. దేశం చూపంతా కేరళ వైపే చూసేలా చేసింది ఈ కేసు. అయితే.., ఇంత ప్రెజర్ లో కూడా కేరళ పోలీసులు అద్భుతంగా ఆలోచించారు. సాక్ష్యాధారాలను సాధించడానికి సీన్ రీ కన్ స్ట్రక్షన్ పద్దతిని ఉపయోగించారు. కొల్లం జిల్లాలోని అరిప్పలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ సీన్ రీ కన్ స్ట్రక్షన్ జరిపించారు.
If you don’t like snakes, don’t watch. Kerala police tried to reconstruct Uthra’s murder using a live cobra and a dummy. This is the video pic.twitter.com/C8XPTy1m3y
— Dhanya Rajendran (@dhanyarajendran) August 26, 2021
మంచంపై ఓ బొమ్మని పెట్టి.. ఆ బొమ్మపైకి నిజమైన నాగుపాముని వదిలారు పోలీసులు. కానీ.., చాలాసేపు ఆ పాము బొమ్మని కాటు వేయలేదు. దీంతో.. చికెన్ ముక్కను ఆ బొమ్మ చేతికి చుట్టి పాము ముందు అనేకసార్లు ఊపారు. కానీ.., నాగుపాము అప్పుడు కూడా కాటు వేయలేదు. దీంతో.. చివరికి ఆ పాముని తలపై తడుతూ, పాముని బాగా రెచ్చగొట్టారు. అప్పుడు పాము ఆ చికెన్ ముక్కపై కసిగా కాటు వేసింది. ఇక్కడే పోలీసులకి కావాల్సిన సాక్ష్యం లభ్యం లభించింది.
మాములుగా పాము కాటుకి అయిన గాయం వెడల్పు 1.7 సెం.మీ ఉంటుంది. అయితే.., ఉత్తర శరీరంపై పాము కరిచిన చోట 2.5 సెంటి మీటర్లు, 2.8 సెంటి మీటర్లు రెండు గాట్లను గుర్తించారు పోలీసులు. సరిగ్గా.., ఆ చికెన్ ముక్కపై కూడా 2.5 సెంటి మీటర్లు, 2.8 సెంటి మీటర్ల గాయం అయ్యింది. అంటే.. భర్త సూరజ్ పాముని రెచ్చగొట్టి మరీ.., ఆమెని కాటు వేపించాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ మొత్తం సీన్ రీ కన్ స్ట్రక్షన్ ని వీడియో తీశారు . కేరళ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన యావత్ దేశాన్ని ఒక ఊపు ఊపేయడంతో.., కేరళ పోలీసులు నిద్రాహారాలు మాని ఈ కేసుని చేధించడం విశేషం.
ఇప్పుడు ఉత్తర హత్య కేసులో నింధుతుడైన భర్త సూరజ్ కి, అతనికి పాముని అమ్మిన వ్యక్తికి శిక్ష పడటానికి ఈ వీడియో తప్పక ఉపయోగపడుతుందని పోలీసులు భావిస్తున్నారు. మరి.., అంధురాలైన భార్యని ఆస్తి కోసం అతి కిరాతకంగా పాము చేత కరిపించి చంపేసిన సూరజ్ కి ఎలాంటి శిక్ష విధించాలి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.