అది 2020.. మే 6వ తేదీ.. కేరళ రాష్ట్రంలోని కొల్లంలోని అంచల్ గ్రామం. అప్పుడే తెల్లారుతోంది. ఆ ఇంటి అల్లుడు సూరజ్ అందరికన్నా ముందుగా నిద్ర లేచాడు. పక్క బెడ్ పై నిద్రపోతున్న తన భార్య ఉత్తరని నిద్రలేపడానికి ప్రయత్నించాడు. కానీ.., ఆమె లేవలేదు. ఎంత ప్రయత్నించినా ఆమెలో చలనం లేదు. పైగా.., నోటి భాగంలో నురుగు, చేతికి పాము కాటు గుర్తులు ఉన్నాయి. అంతే.. తన భార్యని పాము కాటు వేసినట్టు అతనికి అర్ధం అయ్యింది. […]