భార్యాభర్తలు అన్నాక గొడవలు, మనస్పర్ధలు రావడం కామన్. కానీ ఇలాంటి చిన్న చిన్న గొడవలకే కొందరు దంపతులు బరితెగించి ప్రవర్తిస్తుంటారు. క్షణాకావేశంలో భార్యను హత్య చేయడం, లేదంటే భార్యే భర్తను హత్య చేయడం, ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదంటూ ఎస్కెప్ అవ్వడం. ఇలాంటి ఘటనలు దేశంలో రోజుకొకటి వెలుగు చూస్తూనే ఉన్నాయి. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ భర్త భార్యతో గొడవ పడి దారుణంగా కొట్టి చంపాడు. అనంతరం భార్య శవాన్ని ఇంట్లో పాతి నా భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతుంది. ఈ దారుణ ఘటన ఎక్కడ జరిగింది? అసలేం జరిగిందనే పూర్తి వివరాలు మీ కోసం.
అది కేరళలోని ఎర్నాకులం ప్రాంతం. ఇక్కడే సంజీవ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి చాలా రోజుల కిందటే ఓ మహిళతో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతుల సంసారం బాగానే సాగింది. అలా వీరి దాంపత్య సాఫీగా సాగుతున్న తరుణంలోనే సంజీవ్ భార్య పక్క చూపులు చూసినట్లు తెలుస్తుంది. విషయం ఏంటంటే? స్థానికంగా ఉండే పరాయి మగాళ్లతో తన భార్య మాట్లాడుతుందని భర్త సంజీవ్ ఎప్పుడూ భార్యను అనుమానిస్తుండేవాడు. ఇక ఇదే విషయమై తరుచు భార్యాభర్తలు గొడవపడేవారు. అయితే ఇటీవల కూడా భార్యాభర్తలు మరోసారి గొడవపడ్డారు. దీంతో ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. పట్టరాని కోపంతో ఊగిపోయిన భర్త సంజీవ్ తన భార్యను దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆమె శవాన్ని ఎవరికి తెలియకుండా తన ఇంట్లోనే పాతిపెట్టాడు.
ఆ తర్వాత నా భార్య ఆమె ప్రియుడితో కలిసి లేచిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంజీవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఎందుకో సంజీవ్ పైనే పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో పోలీసులు అతడిని విచారించారు. తనకేం సంబంధం లేదన్నట్లుగా ఎక్కడ పొంతనలేని సమాధానాలు చెప్పాడు. చివరికి పోలీసుల స్టైల్ లో విచారించేసరికి భర్త సంజీవ్ అసలు నిజాలు బయటపెట్టాడు. అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత పోలీసులు నిందితుడు సంజీవ్ ను అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.