ఇటీవల కాలంలో మహిళలపై పురుషుల అఘాయిత్యాలు బాగా పెరిగిపోయాయి. లైంగిక దాడులు, అత్యాచారాలు, హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ప్రేమ పేరుతో కొంత మంది యువకులు అమ్మాయిలను హింసించడమే కాదు.. చంపేస్తున్నారు. తనను పెళ్లి చేసుకోలేదని ఓ యువకుడు దారుణంగా యువతి తల నరికి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. కర్ణాటకలోని విజయనగర జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కర్ణాటకలోని విజయనగర జిల్లాలో కూడ్లిగి తాలూకా కన్నిబొరయ్యహట్టికి చెందిన భోజరాజ అనే యువకుడు ట్రాక్టర్ డ్రైవర్. అతని సమీప బంధువు అయిన యువతి నిర్మలను ప్రేమించాడు. ఆమె వయసు 21. ప్రస్తుతం బీఎస్సీ నర్సింగ్ చేస్తుంది. ఇటీవల ఆమె ఇంటికి వెళ్లిన భోజరాజు నిర్మల తండ్రితో మీ కూతురుని పెళ్లి చేసుకుంటానని అన్నాడు. తమ కూతురుని చదువు పూర్తయ్యాక మంచి ఉద్యోగస్తునికి ఇచ్చి వివాహం చేస్తానని చెప్పాు నిర్మల తండ్రి. దీంతో ఆమె పై కక్ష్య పెంచుకున్నాడు భోజరాజు.
రెండు నెలల తర్వాత మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు భోజరాజు. ఇటీవల నిర్మల తన సొంత ఊరుకి వచ్చింది. గురువారం మధ్యహ్నం నిర్మల ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకొని భోజరాజు ఆమె ఇంటికి వెళ్లి గొడవ పెట్టుకున్నాడు. తనతోపాటు తెచ్చుకున్న కత్తితో ఆమె తలనరికి దారుణంగా హత్యచేశాడు. అంతేకాదు తలను సంచిలో వేసుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇది చదవండి: దారుణం.. భార్యను కరెంట్ స్తంభానికి కట్టేసి కొట్టిన భర్త.. వీడియో వైరల్!