గత కొన్నాళ్లుగా క్యాసినో, రేవ్ పార్టీ అనే మాటలు దేశవ్యాప్తంగా ప్రజలకు బాగా అలవాటు అయిపోయాయి. ఎక్కడ చూసినా క్యాసినో నిర్వహించారు, ఇంత మందిని అరెస్ట్ చేశారని వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఊరి చివర ఫామ్ హౌస్‌లో గుట్టుచప్పుడు కాకుండా రేవ్ పార్టీ.. రైడింగ్‌లో దొరికిన ప్రముఖులు అంటూ విన్నాం. అయితే ఇప్పుడు కంచే చేను మేసిన చందాన ఓ ఘటన జరిగింది. దేశవ్యాప్తంగా ఈ క్యాసినో- రేవ్ పార్టీ తీవ్ర కలకలం రేపింది.
రైడింగ్ చేసి చట్టవ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారిని అరెస్ట్ చేయాల్సిన పోలీసులు అధికారులు ఓ రేవ్ పార్టీలో మందేసి- చిందేస్తూ దొరకడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా అలా దొరికిన వారిలో ఓ ప్రభుత్వ టీచర్ కూడా ఉండటం మరిన్ని విమర్శలకు తావిస్తోంది. విలాసాలు, వినోదం పేరిట వేరే రాష్ట్రానికి వెళ్లి మరీ వీళ్లు జల్సాలు చేస్తూ అడ్డంగా దొరికిపోయారు.
వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని జైపూర్‌లో మారుమూల ఓ ఫామ్ హౌస్‌లో క్యాసినో- రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారంటూ పోలీలుసులకు సమాచారం అందింది. పక్కా సమాచారంతో అర్ధరాత్రి దాటాక స్థానిక పోలీసులు ఫామ్ హౌస్‌పై దాడులు నిర్వహించారు. ఆ దాడుల్లో 13 మంది యువతులు/మహిళలతో సహా మొత్తం 84 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి పేర్లు వివరాలను నమోదు చేసుకున్న పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
దొరికిన వారిలో నలుగురు చెప్పిన వివరాలు చూసి వాళ్లు కంగుతిన్నారు. కర్ణాటకకు చెందిన ముగ్గురు పోలీసు అధికారులు, ఒక ప్రభుత్వ టీచర్ ఉన్నారని తెలుసుకున్నారు. పోలీసు అధికారి అంజనప్పతో పాటు మరో ఇద్దరు పోలీసు అధికారులు, కోలారులోని తరహళ్లి ప్రభుత్వ పాఠశాల టీచర్ రమేశ్ ఉన్నట్లు పోలీసులు స్థానిక మీడియాకు వెల్లడించారు.
అయితే ఎంజాయ్ చేసేందుకు జైపూర్ వెళ్లిన పోలీసు అధికారులు, టీచర్.. రూ.2 లక్షలు ఎంట్రీ ఫీజు కట్టి మరీ క్యాసినోకి వెళ్లడం కర్ణాటకలో హాట్ టాపిక్ గా మారింది. ఉద్యోగాలకు సెలవు పెట్టి రేవ్ పార్టీలో చిందులేసిన పోలీసులపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Cop, prof among 84 nabbed from #Jaipur resort; #Casino party busted in police #Raid, #Jaisinghpura Area pic.twitter.com/8ZVdDIPVmy
— Himanshu dixit 💙🇮🇳 (@HimanshuDixitt) August 22, 2022