ప్రేమించి పెళ్లి చేసుకున్న కొందరు జంటలు ఏడాది తిరగకముందే నిండు సంసారాలను నాశనం చేసుకుంటున్నారు. వివాహేతర సంబంధాలని, భర్త తాగుడుకు బానిసయ్యాడని, సంసారానికి సహకరించట్లేదనే కారణాలతో కొందరు వివాహితలు ఆత్మహత్యలకు పూనుకుంటున్నారు. ఇదే తరహాలో ఓ పెళ్లైన మహిళ భర్త చేసిన పనికి సూసైడ్ చేసుకుంది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్నాటకలోని దొడ్డబళ్లాపురం పరిధిలోని త్యాగరాజనగర్ ప్రాంతం. గౌతమ్ (28), వందన (24) ఏడాది క్రితం ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నారు. అయితే కొంత కాలం బాగానే వీరి దాంపత్య జీవితం బాగానే సాగింది. కొన్ని రోజులు గడిచే కొద్ది కుటుంబంలో కలహాలు పుట్టుకొచ్చాయి. భర్త తాగుడుకు బానిసై రోజు వేధింపులకు గురి చేసేవాడు.
ఇది కూడా చదవండి: Srikakulam: ఇంటర్ లోనే ప్రేమలో పడింది.. ఈ ఒక్క కారణంతో తట్టుకోలేకపోయింది!
దీంతో తట్టుకోలేకపోయిన భార్య భర్తను పలుమార్లు హెచ్చరించే ప్రయత్నం చేసింది. అయినా భర్త ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో తట్టుకోలేక పోయిన భార్య మంగళవారం నాడు ఇంట్లో గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ పడుతున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.