అతని పేరు జాఫర్ సాబ్. నగరంలో డీఏఆర్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. గతంలో ఇతడు ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. కొంత కాలానికి వీరికి ఓ కుమారుడు జన్మించాడు. కట్ చేస్తే జాఫర్ మరో మహిళను పెళ్లి చేసుకుని.. చివరికి రెండో భార్య చేతిలో హత్యకు గురయ్యాడు. అసలేం జరిగిందంటే?
కర్ణాటకకు చెందిన జాఫర్ సాబ్ (37) అనే వ్యక్తి DAR కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. ఇతడు గతంలో ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. పెళ్లైన కొన్నాళ్ల పాటు ఆమెతో బాగానే సంసారం చేశాడు. కట్ చేస్తే.. మొదటి భార్యను వదిలేసి కానిస్టేబుల్ రెండో వివాహం చేసుకున్నాడు. ఇక్కడి నుంచే కానిస్టేబుల్ జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకుని.. చివరికి రెండో భార్య చేతిలో హత్యకు గురయ్యాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?
కర్ణాటకలోని కంప్లి మెట్రి పరిధిలోని చిన్నాపురం గ్రామానికి చెందిన జాఫర్ సాబ్ (37) అనే వ్యక్తి డీఏఆర్ కానిస్టేబుల్ గా పని చేసేవాడు. ఇతడు గతంలో నబీనా అనే మహిళను వివాహం చేసుకున్నాడు. కొంత కాలం పాటు జాఫర్ ఆమెతో సంసారం చేశాడు. కొన్నాళ్లకి ఈ దంపతులకు ఓ కూతురు, కుమారుడు జన్మించారు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. జాఫర్ తన మొదటి భార్యను వదిలేసి ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తున్న హనుమక్కెను రెండో వివాహం చేసుకున్నాడు. ఇక పెళ్లైన నాటి నుంచి ఈ దంపతులు నగరంలోని పోలీస్ వసతి గృహంలో ఉంటూ సంతోషంగానే కాపురం చేశాడు. కొన్నాళ్ల తర్వాత ఈ దంపతులకు ఓ కుమారుడు జన్మించాడు.
ఇకపోతే గత కొన్ని రోజుల నుంచి జాఫర్ తన మొదటి భార్య అయిన నబీనా వద్దకు అప్పుడప్పుడు వెళ్తుండేవాడట. ఈ విషయం తెలుసుకున్న రెండో భార్య.. భర్త జాఫర్ తో గొడవకు దిగింది. బుధవారం కూడా రెండో భార్య భర్తతో గొడవకు పడింది. ఇదే విషయంపై ఇద్దరూ ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఇక కోపంతో ఊగిపోయిన రెండో భార్య తట్టుకోలేక భర్త జాఫర్ పై ఇనుప రాడ్ తో దాడి చేసింది. ఈ దాడిలో జాఫర్ తీవ్రంగా గాయపడ్డాడు. స్పందించిన స్థానికులు జాఫర్ ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
అయితే చికిత్స పొందుతూ జాఫర్ ప్రాణాలు విడిచాడు. అతని మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం జాఫర్ మృతిపై ఆయన సోదరి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపి నిందితురాలు రెండో భార్య హనుమక్కెను అరెస్ట్ చేశారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. క్షణికావేశంలో కానిస్టేబుల్ భర్తను హత్యను చేసిన ఈ మహిళ దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.