క్షణికావేశంలో ఓ బాలిక సంచలన నిర్ణయం తీసుకుంది. తండ్రి ఐస్ క్రీమ్ కొనివ్వలేదని కూతురు ఆత్మహత్య చేసుకుంది. తాజాగా కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
నేటి కాలం యువత ప్రతీ చిన్న విషయానికి ఆత్మహత్యలు చేసుకుని కన్నవాళ్లకు కడుపుకోతను మిగిల్చి వెళ్లిపోతున్నారు. చదువులో రాణించలేకపోతున్నానని, ప్రియుడు మోసం చేశాడని, తల్లిదండ్రులు మందలించారనే కారణాలతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అచ్చం ఇలాగే ఆలోచించిన ఓ బాలిక.. తండ్రి ఐస్ క్రీమ్ కొనివ్వలేదని ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తాజాగా తెలంగాణలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
పోలీసుల కథనం ప్రకారం.. అది తెలంగాణలోని కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అన్నారం గ్రామం. ఇక్కడే పుల్లురి వేదశ్రీ (17) అనే బాలిక తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటూ స్థానికంగా చదువుకునేది. ఇదిలా ఉంటే ఇటీవల వేదశ్రీ తండ్రిని ఐస్ క్రీమ్ కొనివ్వాలని అడిగింది. అయితే ఇక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, తండ్రి కూతురికి ఐస్ క్రీమ్ కొనివ్వలేదని స్థానికులు చెబుతున్నారు. దీంతో కూతురు తీవ్ర మనస్థాపానికి గురైంది. ఇక క్షణికావేశంలో ఆ బాలికకు ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు.
తాజాగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ బాలిక ఫ్యానుకు చున్నీతో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ సీన్ చూసిన ఆ బాలిక తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. వెంటనే కూతురుని కిందకు దింపి ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ, ఫలితం లేకపోవడంతో వేదశ్రీ అప్పటికే ప్రాణాలు విడిచింది. సమాచారం అందుకున్న పోలీసులు హటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఆ బాలిక మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి చిన్న చిన్న సమస్యలకు పరిష్కారమే లేదన్నట్లుగా చాలా మంది యువత, మహిళలు క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయితే ఇలాంటి వారికి మీరిచ్చే సూచలను, సలహాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.