దురదృష్టం వెంటాడితే మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జరిగే అపాయం జరగక మానదు. అలా వీరి విధి రాత ఊహించని విషాదాన్ని నింపి రెండు ప్రాణాలు గాలిలో కలిసి పోయేలా చేసింది. నీడలా ఉంటుందని వేసుకున్న రేకుల షెడ్డుకు కరెంట్ షాక్ తగలడంతో ఇనుప రాడ్డును పట్టుకుని తల్లీ కూతురు షాక్ కు గురై మరణించిన తీరు స్థానికులందరినీ కంటతడి పెట్టిస్తుంది. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది. అది జిల్లాలోని బాన్సువాడ మండలం ఖడ్లాపూర్. ఇదే గ్రామానికి చెందిన తుకారం, అంకిత భార్యాభర్తలు. వీరికి ముగ్గురు పిల్లల సంతానం.
ఇది కూడా చదవండి: Nalgonda: పాపం.. ఈ చిన్నారి మరణించిన తీరు చూస్తే గుండె బరువెక్కుతోంది!
అయితే 5 ఏళ్ల చిన్నారి అక్షర తల్లితో పాటు మంగళవారం ఇంటి వద్ద ఆడుకుంటూ ఉంది. ఈ క్రమంలోనే వారి ఇంటి ముందు వేసుకున్న రేకుల షెడ్డుకు ఉన్నట్టుండి కరెంట్ షాక్ తగిలింది. దీంతో ఇంట్లో ఉన్న ఇనుప రాడును పట్టుకోవడంతో తల్లితో పాటు అక్షిర కరెంట్ షాక్ కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇది గమనించిన స్థానికులు భర్త తుకారంకు సమాచారాన్ని అందించారు. దీంతో హుటాహుటిన ఇంటికి చేరుకున్న భర్త విగతజీవులుగా పడి ఉన్న భార్య, కూతురుని చూసి లబోదిబో మంటూ ఏడ్చాడు. ఈ విషాద ఘటనను చూసిన గ్రామస్తులు అయ్యో పాపం.. అంటూ కంటతడిపెడుతున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.