ఆషాడ బోనాల జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే జోగిని శ్యామల గురించి అందరికీ తెలిసిందే. ఇటీవల ఆమె పలు కాంట్రవర్సీలు ఎదుర్కొన్నారు. పలు చిత్రాల్లో నటించిన జోగిని శ్యామల సైబర్ వేధింపులు ఎదురయ్యాయి. తనకు భక్తురాలిగా పరిచయమైన పాతబస్తీకి చెందిన మౌనిక యాదవ్ ఎస్సెమ్మెస్‌లు, వాట్సాప్ సందేశాలతో వేధింపులకు గురి చేస్తున్నట్లు సోమవారం శ్యామల సిటీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఆషాడ బోనాల జాతరలో ఆమె ప్రత్యేకంగా బోనాలు సమర్పిస్తారు. ఆ సమయంలో పాతబస్తీకి చెందిన మౌనిక యాదవ్ సైతం ఇలానే శ్యామలకు పరిచయమయ్యింది.
ఇది చదవండి: వామ్మో.. సజ్జనార్ క్రియేటివిటీకి నెటిజన్ల ఫిదా.. వీడియో వైరల్!
ఇటీవల ఈ ఇద్దరి మద్య కొన్ని అంశాలపై వివాదం నెలకొంది. తనను మానసికంగా శ్యామల వేధిస్తున్నారని మౌనిక ఆరోపణ. ఆ మద్య జోగిని శ్యామల ఇంటికి మౌనిక వెళ్లి పెద్ద గొడవ చేసింది. ఈ క్రమంలోనే శ్యామలకు అభ్యంతరకరమైన ఎస్సెమ్మెస్‌లు, వాట్సాప్ సందేశాలను మౌనిక పంపిస్తున్నట్లు శ్యామల ఆరోపణ. శ్యామలతో పాటు ఆమె కుటుంబాన్నీ కించపరిచే, అవమానించేలా అభ్యంతరకరమైన అంశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో శ్యామల సైబర్ క్రైమ్ పోలీసులకు ఆశ్రయించింది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఇన్‌స్పెక్టర్ ఎస్.శ్రీనివాసరావు సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నారు.