కొందరు ప్రేమకు కులం, మతం, వర్గం, వర్ణం అడ్డురావని చెబుతుంటారు. అంతేకాకుండా ప్రేమ గుడ్డిది అంటూ వేదాలు వల్లిస్తుంటారు. ప్రేమకు వయసుతో కూడా సంబంధం లేదా? 37 ఏళ్ల వ్యక్తి 15 ఏళ్ల అమ్మాయిని వలలో వేసుకుని పెళ్లి పేరుతో.. ఆమెతోనే తల్లిదండ్రులను హత్య చేయించిన దారుణ ఘటన కలకలం రేపుతోంది. ప్రియుడితో తన వివాహానికి అడ్డొచ్చారని తల్లిదండ్రులను కత్తి, కుక్కర్‌తో తలపై కొట్టి అతికిరాతకంగా హత్య చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. జార్ఖండ్ రాష్ట్రం తూర్పు సింగ్‌భూమ్ జిల్లా టెల్కో పోలీస్ స్టేషన్ పరిధిలో మానిఫిట్‌లో సోమవారం ఈ ఘటన వెలుగు చూసింది. ఓ 15 ఏళ్ల యువతి 37 ఏళ్ల వ్యక్తితో ప్రేమలో పడింది. అతను మాయమాటలు చెప్పి ఆమెను లొంగదీసుకున్నాడు. అంతేకాకుండా ఆమె ప్రియుడితో పెళ్లికి సిద్ధమైపోయింది. ఆదివారం రాత్రి ఇద్దరూ వెళ్లిపోతుండగా తల్లిదండ్రులు అడ్డుకున్నారు. వెళ్లడానికి వీల్లేదంటూ ఆమెను నిలువరించారు.
ప్రియుడితో పెళ్లికి తల్లిదండ్రులు అడ్డొస్తున్నారని ఇద్దరూ కలిసి కత్తి, ప్రెషర్ కుక్కర్‌తో వారి తలలపై కొట్టి అతి కిరాతకంగా హత్య చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్లు పారిపోయారు. తెల్లారే సరికి బాధితులను రక్తపుమడుగులో చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారి కుమార్తె కనిపించకుండా పోయిందని వారు చివరిగా చెప్పినట్లు పోలీసులు తెలిపారు.
మృతులు ఇచ్చిన సమాచారంతో నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. వారు చివరికి మంగళవారం ఉదయం బిర్సాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓమ్‌నగర్‌లో పట్టుబడ్డారు. వారి నుంచి కత్తి, కుక్కర్, స్కూటర్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. స్థానికంగా ఈ వార్త కలకలం రేపుతోంది. 37 ఏళ్ల ప్రియుడి కోసం తల్లిదండ్రులను హత్య చేసిన బాలికపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.