ఈ మద్య దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం, అతి వేగం.. వీటితో పాటు అనుకోని సంఘటనలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా నిజామాబాద్ ముప్కాల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నుంచి నిర్మల్ వెళ్తున్న కారు.. ముప్కాల్ మండలం కొత్తపల్లి వద్ద టైరు పేలిపోయింది. దాంతో కారు ఒక్కసారిగే ఎగిరి అక్కడే ఉన్న డివైడర్ ని ఢీ కొట్టి దాటి అవతలత రోడ్డుపై పడింది. కారులో ఏడుగురు ప్రయాణిస్తుస్తున్నట్లు సమాచారం. ఇక మృతి చెందిన వారిలో ఇద్దరు చిన్నాల సహ నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. బాధితులను హైదరాబాద్‌లోని టోలిచౌకికి చెందిన వారిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇది చదవండి: వీడియో: డీజే వ్యాన్ పైకెక్కి డ్యాన్స్ చేసిన యువకుడు! ఇంతలోనే..