అది జనగామ జిల్లా శ్రీరామ్ నగర్ లోని మూలబావి. ఇదే ప్రాంతానికి చెందిన పకీరు రమేష్ అనే యువకుడు ఓ ప్రైవేట్ స్కూల్ లో పని చేస్తున్నాడు. రమేష్ పని చేస్తున్న స్కూల్ లోని ఓ వివాహిత కూడా పని చేస్తుంది. ఇద్దరు ఒకే స్కూల్ లో పని చేస్తుండడంతో కాస్త పరిచయం పెరిగింది. అది ఇంకాస్త చనువుగా మారడంతో రమేష్ ఆ వివాహిత మొబైల్ కు అసభ్యకరంగా మెసేజ్ పంపించాడు. కొన్ని రోజుల తర్వాత రమేష్ పంపిన ఆ మెసేజ్ ను ఆ వివాహిత భర్త సందీప్ చూసి రమేష్ కు ఫోన్ చేసి మందలించాడు.
ఇంతటితో ఆగకుండా నా భార్యకు ఇలాంటి మెసెజ్ లు పెడతావా అంటూ సందీప్ రమేష్ ను ఓ చోటకు పిలిచి మరోసారి మందలించే ప్రయత్నం చేశాడు. ఇక తన ఒప్పుకున్న రమేష్ ను సందీప్ తన కాళ్లు మొక్కించుకున్నాడు. కట్ చేస్తే రెండేళ్ల తర్వాత రమేష్ తమ్ముడైన సురేష్ కు సందీప్ తన అన్నతో కాళ్లు మొక్కించున్న విషయం తెలిసింది. ఇక కోపంతో ఊగిపోయిన సురేష్.., వివాహిత భర్త సందీప్ కు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చాడు. ఇక ఇంతటితో సురేష్ పగ చల్లారలేదు.
అయితే సురేష్.., తన ఫ్రెండ్స్ తో పాటు సందీప్ తో కలిసి ఈ నెల 16 అందరూ ఓ చోట కలిసి మద్యం సేవించారు. అందరు జోరుగా మత్తులోకి జారుకున్నాక సురేష్ సందీప్ తో మరోసారి గొడవకు దిగాడు. తన అన్నతో కాళ్లు మొక్కించుకుంటావా అంటూ కోపంతో రగిలిపోయాడు. ఇదే విషయంపై ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో గొడవ పతాక స్థాయికి చేరుకుంది. కోపంతో ఊగిపోయిన సురేష్ తన వద్ద ఉన్న కీచేన్ కత్తితో సందీప్ ను దారుణంగా పొడిచి హత్య చేశాడు. ఈ దాడిలో సందీప్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. చివరికి ఈ విషయం పోలీసులకు వరకు వెళ్లడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.