జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పొలం వివాదాల కారణంగా ఓ వ్యక్తి ప్రత్యర్థిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాధితుడి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల రూరల్ మండలం కల్లెడ. ఇదే గ్రామానికి చెందిన ఏనూరి శంకరయ్య, మల్లయ్య అనే రైతుల మధ్య గత 10 ఏళ్ల నుంచి పొలం విషయంలో తరుచు గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇలా ఎన్నోసార్లు గొడవలు కూడా జరిగాయి.
అనంతరం పెద్దల వరకు వెళ్లినా కూడా వీరి సమస్యకు పరిష్కారం దొరకలేదు. అయితే ఈ క్రమంలోనే తాజాగా మరోసారి వీరిద్దరి మధ్య గొడవలు జరిగాయి. ఏకంగా పొలంలో చేరి ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే మల్లయ్యపై కోపం పెంచుకున్న శంకరయ్య తన వెంట తెచ్చుకున్న కత్తితో దాడికి తెగబడ్డాడు. మల్లయ్య కొడుకు చూస్తుండగానే అతనిపై శంకరయ్య 8 సార్లు కత్తితో దారుణంగా పొడిచాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ మల్లయ్యను అతని కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం చికిత్స పొందుతున్న మల్లయ్య ఆరోగ్య పరిస్థితి కాస్త విషమంగానే ఉన్నట్లుగానే వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై మల్లయ్య కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయలను కామెంట్ రూపంలో తెలియజేయండి.