ప్రజలు వైద్యులను కనిపించే దేవుళ్లుగా భావిస్తారు. తమకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదిస్తారు. అలానే వైద్యులు కూడా రోగులకు చికిత్స అందించి వారి ప్రాణాలు కాపాడుతుంటారు. కొందరు వైద్యులు మాత్రం వృతిలో నిర్లక్ష్యంగా ఉంటూ రోగుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. తాజాగా జగిత్యాల జిల్లాలోని ఏరియా ఆస్పత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం బయటపడింది.
ప్రజలు వైద్యులను కనిపించే దేవుళ్లుగా భావిస్తారు. తమకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదిస్తారు. అలానే వైద్యులు కూడా రోగులకు చికిత్స అందించి వారి ప్రాణాలు కాపాడుతుంటారు. అయితే కొందరు వైద్యులు మాత్రం తమ వృతిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ముఖ్యంగా ఆపరేషన్ చేసే సమయంలో వివిధ రకాల వస్తువులు పేషంట్ పొట్టలో పెట్టి కుట్లు వేస్తుంటారు. ఇలాంటి ఘటనల్లో కొందరు మరణించగా మరికొందరు తీవ్ర నరకవేదన అనుభవిస్తున్నారు. ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. తాజాగా జగిత్యాల జిల్లాలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన నవ్య శ్రీ అనే బాలింత జగిత్యాలోని తన తల్లిగారి ఇంటి వద్ద ఉంది. గతేడాది డిసెంబర్ లో స్థానిక ఏరియా ఆస్పత్రిలో నవ్యశ్రీ చేరింది. అయితే అక్కడ ఆమెకు డాక్టర్లు సిజేరియన్ చేశారు. ఆపరేషన్ చేసే సమయంలో పొట్టలో కర్చీఫ్, కాటన్ గుడ్డను మరిచిపోయి కుట్లు వేశారు. దీంతో అనంతంర ఇంటికి వెళ్లిన నవ్యశ్రీని కడుపు నొప్పి బాధించింది. అలానే గత 16 నెలలుగా నుంచి నవ్య శ్రీ కడుపునొప్పితో బాధపడుతూ వచ్చింది. బాలింత కావడంతో కడుపు నొప్పి అని భావించిన కుటుంబ సభ్యులకు.. నవ్యశ్రీ బాధ కలచి వేసింది.
సంవత్సరాలు గడుస్తున్న కొద్ది సమస్య తగ్గకపోగా బాధ ఇంకా ఎక్కువ అయింది. దీంతో కడుపు నొప్పిన భరించలేని స్థితిలో నవ్యశ్రీ వేములవాడలోని ఓ ఆస్పత్రిలో చేరింది. అక్కడి వైద్యులు స్కానింగ్ చేసి.. చూసి షాక్ గురయ్యారు. ఆమె నొప్పికి గల అసలు విషయం ఏమిటో వెలుగులోకి వచ్చింది. ఆ స్కానింగ్ లో నవ్య శ్రీ పొట్టలో కర్చీఫ్, కాటన్ గుడ్డలు ఉన్నట్లుగా డాక్టర్లు గుర్తించారు. ఈ విషయం తెలియడంతో నవ్య శ్రీ కుటుంబ సభ్యులు కూడా షాక్ కు గురయ్యారు. వెంటనే ఆపరేషన్ చేసిన వైద్యులుఅడుగుదామని జగిత్యా ఏరియా ఆసుపత్రికి వెళ్లగా అక్కడ వైద్యులు లేరు. దీంతో నవ్యశ్రీ కుటుంబ సభ్యులు అక్కడి నుంచి వెనుదిరిగారు.
అనంతరం ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదులపై స్పందించిన కలెక్టర్ యాస్మిన్.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే గతంలో కూడా జగిత్యాల మాత శిశు, ఏరియా ఆసుపత్రుల్లో వైద్యులనిర్లక్ష్యంతో ఆరుగురు గర్భిణీలు,చిన్నారులు మృతి చెందారని స్థానికులు అంటున్నారు. మరి.. ఇలా వైద్యుల నిర్లక్ష్యం కారణంగా జరుగుతున్న ఘోరాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.