ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని అనుకోని ప్రమాదాలు అయితే.. కొన్ని డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల జరుగుతున్నాయి. మరికొన్ని ప్రకృతి విపత్తుల వల్ల జరుగుతున్నాయి. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ క్రమంలో పలు చోట్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఇటీవల రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతూ ఉన్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, అతి వేగం, ప్రకృతి విపత్తు వల్ల జరిగే ప్రమాదాల వల్ల వారి కుటుంబాల్లో విషాదాలు నిండుకుంటున్నాయి. ఎంతో మంది అనాథలుగా మిగిలిపోతున్నారు. ఇటీవల తెలంగాణలో అకాల వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లన్నీ బుడదమయం కావడంతో పలు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో జగిత్యాలలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ఓ మహిళా కానిస్టేబుల్ మృతి చెందింది. వివరాల్లోకి వెళితే..
జగిత్యాల జిల్లా మాల్యాలలో తీవ్ర విషాదం చోటు చేసకుంది. మాల్యాల పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న వేదశ్రీ అనే మహిళా కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదంలో మరణించింది. వేదశ్రీ తన బైక్ పై వస్తున్న సమయంలో మాల్యాల సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వద్ద అదుపు తప్పి కిందపడిపోయింది. దీంతో ఆమె తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే ఆమెను జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ వేదశ్రీ తుది శ్వాస విడిచింది. అందరితో ఎంతో కలుపుగోలుగా ఉంటూ.. విధి నిర్వహణలో ఎంతో నిజాయితీగా ఉండే వేదశ్రీ అకస్మాత్తుగా చనిపోవడంతో కుటుంబ మాల్యాల పోలీస్ స్టేషన్ విషాదఛాయలు నెలకొన్నాయి.
వేదశ్రీ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అయ్యారు. డిపార్ట్ మెంట్ లో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఎన్నో కలలు కనే తమ కూతురు అర్థాంతరంగా కన్నమూయడంతో ఆ కుటుంబ సభ్యుల కన్నీరు ఆపడం ఎవరితరం కాలేదు. వేదశ్రీ మరణం వార్త తెలుసుకున్న జిల్లా ఎస్పీ భాస్కర్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చి, మృతదేహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. సహ ఉద్యోగులు, స్థానికులు ఆమెకు శ్రద్దాంజలి ఘటించారు.