జగద్గిరిగుట్టలో రేష్మ అనే యవతి నివాసం ఉంటుంది. హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ వస్తుంది. అయితే రేష్మా ఎప్పటిలాగే ఈ నెల 8వ తేదీన ఉద్యోగానికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చింది. ఇక సాయంత్రం పూట తన స్నేహితురాలిని కలిసి వస్తానని తన సోదరుడికి చెప్పి వెళ్లింది. కానీ.. రాత్రి 10 గంటలు అయినా రేష్మా ఇంటికి మాత్రం రాలేదు. రేష్మా సోదరుడు చాలా సార్లు ఫోన్ లు చేసినా సమాధానం ఇవ్వలేదు. దీంతో ఖంగారుపడ్డ అతడు ఏం చేయాలో తెలియక వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మేడ్చల్ జిల్లాలోని జదద్గిరిగుట్టలో ఎల్లెందుల రేష్మా (23) అనే యువతి తన సోదరుడితో పాటు నివాసం ఉంటుంది. ఉన్నత చదువులు పూర్తి చేసిన రేష్మా నగరంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ వస్తుంది. అయితే ఎప్పటిలాగే డ్యూటీకి వెళ్లిన రేష్మా ఈ నెల 8న ఇంటికి వచ్చి తన స్నేహితురాలిని కలిసి వస్తానని తన సోదరుడికి చెప్పి వెళ్లింది. కానీ రాత్రి 10 గంటలు దాటినా.. ఆ యువతి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఖంగారుపడ్డ భర్త రేష్మా సోదరుడు ఆమెకు చాలా సార్లు ఫోన్ చేశాడు.
కానీ ఎంతకు రేష్మా సమాధానం ఇవ్వలేదు. ఇక ఆమె సోదరుడికి ఏం చేయాలో అర్థం కాక కుత్భుల్లాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నా సోదరి ఈనెల 8 నుంచి కనిపించకుండపోయిందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. రేష్మా సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రేష్మా ఉన్నట్టుండి కనిపించకుండపోవడంతో ఆమె సోదరుడితో పాటు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.