అతను ఓ అమ్మాయిని ప్రేమించాడు. కానీ, అతని తల్లిదండ్రులు ప్రేమించిన యువతితో కాకుండా మరో యువతిని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆ యువకుడు చేసిన పనికి అంతా షాక్ అయ్యారు. అసలేం జరిగిందంటే?
నేటి కాలం యువత ఎక్కువగా ప్రేమ పెళ్లిళ్లకే మొగ్గు చూపుతున్నారు. కొందరు తల్లిదండ్రులను ఎదురించి పెళ్లి చేసుకుంటే, మరి కొందరు మాత్రం తల్లిదండ్రులను ఒప్పించి మరీ వివాహం చేసుకుంటున్నారు. కానీ, ప్రేమించిన అమ్మాయిని కాకుండా మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటూ తల్లిదండ్రులు ఓ యువకుడిని బలవంతం చేశారు. ఇక ఓ యువతితో పెళ్లికి ఏర్పాట్లు కూడా చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ క్రమంలోనే ఆ యువకుడు చేసిన పనికి అంతా షాక్ గురవుతున్నారు. ఆ యువకుడు చేసిన పనేంటో తెలుసా?
పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ రామాంతాపూర్ పరిధిలోని గోకుల్ నగర్ ప్రాంతం. ఇక్కడే సాంబరాజు (22) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతడు స్థానికంగా ఉన్న ఓ నగల దుకాణంలో పని చేస్తున్నాడు. అయితే ఇతడు ఇదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని గత కొంత కాలంగా ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సాంబరాజు తల్లిదండ్రులు ప్రేమించిన యువతితో కాకుండా మరో యువతితో పెళ్లికి ఒత్తిడి తెచ్చారు. దీనిని సాంబరాజు జీర్ణించుకోలేక తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈ సమయంలో అతనికి ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు. ఇదిలా ఉంటే, సాంబరాజు సోమవారం బేగంపేటలోని ఓ హోటల్ కు వెళ్లాడు.
అందులోకి వెళ్లాక చున్నీతో ఫ్యానుకు ఉరి వేసుకోవాలని అనుకున్నాడు. అన్ని ఏర్పాట్లు చేసుకుని.. తన స్నేహితులకు వీడియో కాల్ చేశాడు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, అందుకే చనిపోతున్నా అని కాల్ కట్ చేశాడు. దీంతో అతని స్నేహితులు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వెంటనే అతడున్న హోటల్ కు వెళ్లారు. కానీ, ఫలితం లేకపోవడంతో అతడు అప్పటికే మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న మృతుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఆ తర్వాత పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.