ఈమెకు గతంలోనే ఓ వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు భర్తతో కలిసి ఉండేది. అయితే కొన్ని పరిస్థితుల దృష్ట్యా భర్తకు దూరంగా ఉంటున్న ఈ వివాహిత నెల రోజులుగా నగరంలోని ఓ హాస్టల్ లో ఉండేది. తర్వాత ఏం జరిగిందంటే?
అస్సాంకు చెందిన ఈ మహిళకు గతంలోనే ఓ వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు భర్తతో కలిసి ఉండేది. కాగా వీళ్లు గత కొన్నేళ్ల నుంచి హైదరాబాద్ లోనే ఉంటున్నట్లు సమాచారం. అయితే కొన్ని పరిస్థితుల దృష్ట్యా భర్తకు దూరంగా ఉంటున్న ఈ వివాహిత నెల రోజులుగా నగరంలోని ఓ హాస్టల్ లో ఉండేది. ఇకపోతే ఆ మహిళ ఉన్నట్టుండి ఇలా చేయడంతో ఆమె భర్త, కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ గురవుతున్నారు. అసలేం జరిగిందంటే?
అస్సాం బర్పట, పటచార్ కుడి బార్మాలికుచి ప్రాంతానికి చెందిన కె. కరిష్మాఖాతూమ్ (30) అనే మహిళకు అశోక్ అనే వ్యక్తితో గతంలో వివాహం జరిగింది. వీళ్లు చాలా కాలంగా కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ లోనే నివాసం ఉంటున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే కొన్ని పరిస్థితుల దృష్ట్యా కరిష్మాఖాతూమ్.. తన చెల్లి అయిన బనితా దగ్గరకు వచ్చి మెహదీపట్నం పరిధిలోని ఓ హాస్టల్ లో ఉంటుంది. నెల రోజుల పాటు ఇక్కడే ఉన్నట్టు తెలుస్తుంది.
అయితే మార్చి 19న సాయంత్రం కరిష్మాఖాతూమ్ ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లింది. అప్పటి నుంచి ఆమె ఆచూకి దొరకలేదు. దీంతో ఆమె జాడ కోసం భర్త, కుటుంబ సభ్యులు అంతటా వెతికారు. అయినా ఎక్కడుందనే విషయం మాత్రం తెలియరాలేదు. ఇక ఏం చేయలో అర్థం కాక ఆమె కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఉన్నట్టుండి అస్సలు అనుమానం కూడా రాకుండా కరిష్మాఖాతూమ్ వెళ్లిపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.