సమాజంలో అత్యాచార దాడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. వావివరసలు మరిచి బరితెగించి ప్రవర్తిస్తున్నారు. ఇక అక్కా, చెల్లి, వదిన ఇలా అనుబంధాలను సైతం తుంగలో తొక్కి క్షణిక సుఖం కోసం అడ్డదారులను తొక్కుతున్నారు. మరీ ముఖ్యంగా అభం శుభం తెలియని బాలికలపై కూడా దుర్మార్గులు రెచ్చిపోయి గంతులేస్తున్నారు. తాజాగా ఓ బాలికపై వరుసకు సోదరుడు అయ్యే యువకుడు అత్యాచారం చేసిన ఘటన బాబుపల్లిలో చోటు చేసుకుంది.
తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ బాచుపల్లి పరిధిలోని ఓ బాలికపై వరుసకు అన్న అయ్యే యువకుడు కన్నేశాడు. సమయం దొరికితే ఆ బాలికపై దాడికి పాల్పడేందుకు ఎదురుచూపులు చూస్తున్నాడు. అయితే మూడు రోజుల క్రితం ఆ బాలిక ఒంటరిగా ఉందని ఆ దుర్మార్గుడు గ్రహించాడు. ఇదే మంచి సమయమనుకుని ఆ ఒంటరి బాలికపై దారుణంగా అత్యాచారం చేశాడు.
ఇది కూడా చదవండి: Uttarakhand: కుమారుడిని వివాహం చేసుకున్న మహిళ.. పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త!
అయితే ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. వెంటనే తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. మూడు రోజుల కిందట జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. కాగా ప్రభుత్వాలు నిర్భయ, దిశ వంటి కఠినమైన చట్టాలు రూపొందించినా దాడులు మాత్రం ఆగడం లేదు. ఇలా వావివరసలు మరిచి అడ్డగోలుగా కనికరం లేకుండా చిన్నారులపై దాడులకు తెగబడుతున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.