హైదరాబాద్ లో పట్టపగలు దారుణం చోటు చేసుకుంది. కొందరు దుండగులు రెచ్చి పోయి ప్రవర్తించి ఓ యువకుడిని కిడ్నాప్ చేసి ఊహించని రీతిలో దారుణానికి ఒడిగట్టారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన వీడియోలు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతున్నాయి. అసలు ఆ దుండగులు ఆ యువకుడిని ఎందుకు కిడ్నాప్ చేశారు? కిడ్నాప్ చేసి ఆ తర్వాత ఆ యువకుడి పట్ల ఎలా ప్రవర్తించారు అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.అది హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ ప్రాంతం. ఇక్కడే ఇర్ఫాన్ అనే యువకుడు తల్లిదండ్రులలో పాటు నివాసం ఉంటున్నాడు.
అయితే తాజాగా కొందరు యువకులు వచ్చి ఇర్ఫాన్ ను కిడ్నాప్ చేశారు. అనంతరం అతడిని ఆ దుండగులు తెలియని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. ఇక ఇంతటితో ఆగకుండా అక్కడికి వెళ్ళాక బెదిరించి ఆ యువకుడితో బట్టలు మొత్తం విప్పేలా చేశారు.వారు బయపెట్టడంతో ఆ యువకుడు బట్టలు పూర్తిగా విప్పాడు. ఆపై అతడిని ఇష్టమొచ్చిన రీతిలో కొట్టడంతో పాటు అతని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. ఇక ఈ యువకులు చేసిన దారుణాన్ని తమ సెల్ ఫోన్ లో వీడియో తీసుకున్నారు. అనంతరం ఆ వీడియోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఇక ఆ వీడియోలు వైరల్ అయ్యాయి.అనంతరం ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ యువకుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకాలంగా మారుతోంది.
— Hardin (@hardintessa143) December 7, 2022