పైన ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు వినయ్. వనపర్తి జిల్లాకు చెందిన ఆ యువకుడికి గతంతో ఓ యువతి పరిచయం అయింది. ఈ పరిచయంతోనే ఇద్దరూ కొన్నాళ్ల పాటు మాట్లాడుకున్నారు. అలా వీరి పరిచయం రాను రాను ప్రేమగా మారడంతో ఇద్దరూ ప్రేమించుకున్నారు. వీరి ప్రేమాయణం నెలల నుంచి ఏళ్లు గడిచింది. ఇక ఒకరికొకరు నచ్చుకోవడంతో పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. దీంతో ఇరువురి తల్లిదండ్రును ఒప్పించి ఘనంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లై 6 నెలలు దాటిందో లేదో.. భార్య చేసిన పనికి భర్త తట్టుకోలేక ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారుతోంది.
అది హైదరాబాద్ నగరం అల్వాల్ లోని వెంకటాపురం కాలనీ. ఇక్కడే వినయ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇక్కడే కాపురం పెట్టాడు. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతుల సంసారం బాగానే సాగుతూ వచ్చింది. అలా వీరి దాంపత్య జీవితం సంతోషంగా సాగుతున్న తరుణంలోనే భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చాయట. అయితే ఏదో కారణం చేత భార్య భర్త వినయ్ ను తరుచు వేధింపులకు గురి చేసినట్లుగా తెలుస్తోంది. కాగా భార్య వేధింపులు రోజు రోజుకు ఎక్కువ అవుతుండడంతో భర్త వినయ్ తట్టుకోలేకపోయాడు. అయితే ఈ క్రమంలోనే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.., వినయ్ ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.
అలా వారం రోజులు గడిచింది. వినయ్ ఇంట్లో నుంచి విపరీతమైన దుర్వాసన రావడం మొదలైంది. దీనిని గమనించిన స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత వినయ్ ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి వెళ్లారు. ఇక ఇంట్లోకి వెళ్లి చూడగా వినయ్ ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు. ఈ సీన్ ను చూసిన పోలీసులు, స్థానికులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అనంతరం పోలీసులు వినయ్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న వినయ్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. భార్య వేధింపుల కారణంగానే వినయ్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తాజాగా చోటు చేసుకున్న ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.