పెళ్లైన వివాహితలు అదృశ్యమైన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. ఒకే రోజు పక్క పక్కనే ఉండే ప్రాంతాల్లోని ఇద్దరు వివాహితలు కనిపంచకుండా పోవడంతో కుటుంభికులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. విశాఖపట్నం అక్కయ్యపాలేం కాలనీకి చెందిన లావణ్య, మధు భార్యాభర్తలు. ఇటీవల లావణ్య నేరేడ్‌మెట్‌లోని తన పుట్టింటికి వచ్చి ఈ నెల 13వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇది కూడా చదవండి: భర్తను కాదని ప్రియుడితో జతకట్టింది.. మరో ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్!
ఇదిలా ఉండగా కామారెడ్డి జిల్లాకు చెందిన లింగాపురం స్వామి ఆరు నెలల కిత్రం భార్య సంధ్య(23)తో కలిసి మల్కాజిగిరి బీజేఆర్‌లో నివాసముంటున్నాడు. స్వామి డ్రైవర్‌గా పనిచేస్తుండగా సంధ్య అనుటెక్స్‌లో సేల్స్ ఉమెన్‌గా పని చేస్తోంది. అయితే ఈ నెల 13వ తేదీ రాత్రి ఇంటికి వచ్చిన స్వామికి ఇంట్లో భార్య కనిపించలేదు. దీంతో ఖంగారుపడి ఆమెకు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ రావడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇద్దరు మహిళలు ఒకే రోజు అదృశ్యం కావడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.